నిఖత్‌ శుభారంభం

– మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం చేసింది. గురువారం నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో నిఖత్‌ తొలిరౌండ్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన అనాఖనిమ్‌ను చిత్తుచేసింఇ. 50కిలోల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్‌ తొలిరౌండ్‌నుంచే ప్రత్యర్ధిపై బలమైన పంచ్‌లతో గుక్కతిప్పుకోకుండా చేసింది. రెండోరౌండ్‌లో నిఖత్‌ టాప్‌సీడ్‌, 2022 ఆఫ్రికన్‌ ఛాంపియన్‌ రౌమోస్యా బ్యూలాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక 52కిలోల విభాగంలో సాక్షి ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగిన ఏకపక్ష పోటీలో సాక్షి 5-0పాయింట్ల తేడాతో కొలంబియాకు చెందిన మార్టినేజ్‌ను ఓడించింది. దీంతో టోర్నమెంట్‌లో ప్రి క్వార్టర్స్‌ ఫైనల్లో చోటు దక్కించుకున్న తొలి భారత బాక్సర్‌గా సాక్షి నిలిచింది.