హైదరాబాద్ : బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఇండెక్స్ ప్రముఖ బ్యాంకులను కలిగి ఉందని పేర్కొంది. ప్రయివేటు రంగ బ్యాంకులు 85 శాతం వాటాను, మిగిలిన భాగాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిగి ఉంటాయని తెలిపింది. ఈ కొత్త ఫండ్ 2024 ఆగస్ట్ 8న తెరువబడి 22న ముగుస్తుందని బంధన్ ఎంఏసీ సీఈఓ విశాల్ కపూర్ తెలిపారు.