
నవతెలంగాణ – ముధోల్
దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో బుధవారం రాత్రి జరిగిన దొంగతనం భధ్రత వైఫల్యం ను ఎత్తి చూపుతుంది. నిత్యం భక్తులతో కిటకటలాడే ఆలయం ఒకేసారి ఆలయ సెక్యూరిటీ ఉండంగా కూడా గుర్తు తెలియని దొంగ యదేచ్చగా ఆలయంలో దొంగతనానికి పాల్పడటం భద్రతకు వైఫల్యానికి పరాకాష్ట చేరింది. మరోసాటి రోజు దొంగతనం జరిగినవిషయంబయటపడింది.అప్పటివరకు సెక్యూరిటీ సిబ్బంది కి తెలియక పోవటం గమనార్హం.ప్రతి రోజు నిఘాధికారులు ఎప్పటికప్పుడు భద్రత విషయంను పట్టించుకోవడం లేదని సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . ఆలయం లోపలికి గుర్తు తెలియని దొంగ చొరబడి దత్తాత్రేయ మందిరం ఎదుట ఉన్న హుండిని పగలగొట్టి నగదును దోచుకెళ్లారు .సూమారు రెండు గంటల పాటు దొంగ సంచరించి న్నట్లు తెలుస్తోంది. సిసి ఫుటేజ్ లో స్పష్టం గా కనిపిస్తుంది. ఆలయంలో సెక్యూరిటీ మాత్రం పట్టించుకోకపోవడం వలన పలు అనుమానాలకు తావిస్తోంది. దేశ నలుమూలల నుండి భక్తులు జ్ఞాన సరస్వతి దేవినిదర్శించుకోవడానికి ప్రతినిత్యం భక్తులు వస్తుంటారు. భక్తుల భద్రత దేవుడేరుగా గాని హుండీ పగులగొట్టి దొంగ యదేచ్చగా డబ్బును దొంగలించడం పై స్థానికులు , భక్తులు మండిపడుతున్నారు. ఆలయంలో భద్రత కోసం హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వారి పనితనాన్ని పర్యవేక్షించకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. బాసర ఆలయాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన భద్రతాధికారులు భద్రతను గాలి వదలడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, భక్తులు సైతం బాసర ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .పక్కనే మహారాష్ట్ర ఉన్నప్పటికీ , బాసరలో రైల్వే స్టేషన్ ఉండటంతో రాకపోకలు బాగా ఉంటాయి. నిత్యం నిఘాధికారులు డేగ కన్నులతో భద్రతను పర్యవేక్షించాల్సి ఉండగా కేవలం సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తారే తప్ప మళ్ళీ భద్రతను పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బాసర ఆలయంకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసి, భక్తుల మనోభావాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.