ఫైనల్లో నిఖత్‌ జరీన్‌

ఫైనల్లో నిఖత్‌ జరీన్‌– స్ట్రాంజా బాక్సింగ్‌ టోర్నీ
సోఫియా : స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో బల్గేరియా బాక్సర్‌ చుకనోవపై నిఖత్‌ జరీన్‌ ఏకపక్ష విజయం సాధించింది. మూడు రౌండ్లలోనూ లోకల్‌ బాక్సర్‌ను చిత్తు చేసిన నిఖత్‌ జరీన్‌ 5-0తో పసిడి పోరుకు చేరుకుంది. 29-28, 30-27, 29-28, 30-27, 30-27తో నిఖత్‌ జరీన్‌ సెమీస్‌లో సత్తా చాటింది.