నవతెలంగాణ -మల్హర్ రావు:
మండల కేంద్రమైన తాడిచెర్లలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి కోసం వేసిన పైప్ లైన్ లో భాగంగా సిటీపల్లె ఏడవ వార్డులో ప్రజలకు తాగునీటి సరఫరా కోసం కుళాయి ఏర్పాటు చేశారు.కానీ కుళాయి డ్రైనేజీలో ఉండడమే కాకుండా,కుళాయి చుట్టు మహిళలు నీరు పట్టకుండా డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురైయ్యేవారు.మురుగును తొలగించి కుళాయి వద్ద గద్దె నిర్మాణం చేయాలని వార్డు ప్రజలు కొన్నేళ్లుగా పంచాయతీ పాలకులకు,అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని శేనం నిఖిల్ అనే యువకుడు స్పందించి తన సొంత ఖర్చులతో కుళాయి వద్ద గద్దె నిర్మాణం చేపట్టి మానవత్వం చాటుకున్నాడు.దీంతో పలువురు నిఖిల్ ను అభినందించారు