
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర తొమ్మిదవ సబ్ జూనియర్ డిస్టిక్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ను ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి.నిజామాబాద్ నగరం క్రీడలకు అనువైన స్థలం.నిజామాబాద్ నగరం నుండి యెండల సౌందర్య,నిఖాత్ జరీన్,హుసాముద్దీన్ లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. మీరందరు గెలుపు ఓటములను స్పోర్టివ్ గా తీసుకుని ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,జడ్పీ చైర్మన్ విఠల్ రావు ,తెలంగాణ ఫూట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పాల్గుణ ,ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇగ సంజీవ్ రెడ్డి, నరాల సుధాకర్,జావీద్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.