సీఎంపై అనుచిత వాక్యాలు చేసే నైతిక హక్కు నిరంజన్ రెడ్డికి లేదు

– త్వరలో తీహార్ జైలుకు పంపిస్తాం
– విలేఖరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి
నవతెలంగాణ – అచ్చంపేట
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వాక్యాలు చేసే నైతిక హక్కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కి లేదని,  నిరంజన్ రెడ్డి త్వరలో  తీహార్ జైలుకు పంపిస్తామని విలేఖరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కలసి  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వ్యవసాయ మంత్రి గా ఉన్నపుడు కృష్ణా నది కి సంబంచిన 140 ఎకరాలు కబ్జా చేశాడని, గండిపేట వద్ద మరో 55 ఎకరాలు కబ్జా చేశాడని ఆరోపించారు. లక్ష 50 వేలా ఓటర్లు తిరస్కరించారు. బుద్ది రాలేదన్నారు. నిరంజన్ రెడ్డి అనుచరుడు 40 కోట్లు టర్న్వర్ చేస్తున్నాడని ఆరోపించారు. అధికారంలో ఉన్నపుడు చేసిన అవినీతి, భూమి కబ్జా లు పూర్తి సమాచారంతో  ఏసీబీ, సీఐడీ,అధికారులకు ఇచామని తెలిపారు. నిరంజన్ రెడ్డి చేసిన అవినీతి,అక్రమాలు పైన వనపర్తి రాజీవ్ చౌరస్తా లో చర్చ కు రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ పార్టీ కి కాలం చెల్లింది. అందుకే రేవంత్ రెడ్డి చేసున్న అభివృ చూసి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారని తెలిపారు. ఏడు మండలాలు ఆంధ్రకు పోతే ఒక్క రోజు కూడా మాట్లాడలేదన్నారు. రూ.7లక్షల కోట్లు అప్పు ఊబిలోకి రాష్ట్రం వెళ్ళిందన్నారు. విలేకరుల సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.