రాజన్న సేవలో నిర్మల్ ఎమ్మెల్యే..

Nirmal MLA in Rajanna service..నవతెలంగాణ – వేములవాడ 
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు  చెల్లించారు. ముందుగా వారిని రాజన్న దేవాలయ, అధికారులు అర్చకులు సాధర స్వాగతం పలికి రాజన్నను దర్శించుకునే అవకాశం కల్పించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వాదం గావించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారి స్వామి వారి చిత్రపటం అందజేశారు.  వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ,ఆలయ పర్యవేక్షకులు అలి శంకర్, సంకపల్లి పవన్ ,శ్రీనివాస్ రెడ్డి,  బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, రేగుల మల్లికార్జున్ స్థానిక బిజెపి నాయకులు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.