రచనారంగం లో యువతరంగం నిషాంత్ ఇంజిమ్

Nishant Engm is the youth field in the field of writingవలస జీవిత అనుభవాలకు అక్షరరూపం
కొన్ని ప్రశ్నలు.. ఆయన కథల్లోని అంశాలపై సంభాషణలు ఇందులో ఉన్నాయి. పలుమార్లు నిషాంత్‌ ఇంజమ్‌ తన పుస్తకంలోని ముఖ్యమైన విషయాలను చదివి వినిపించాడు కూడా.
భారత రెస్టారెంట్‌లలోనూ ఎవరైనా ఇది చాలా కారంగా ఉన్నదని చెబుతానే ఒప్పుకోను. అంతేమీ కారం లేదే అనేదే నా వ్యక్తిగత అనుభవంగా ఉంటుంది. కానీ, కారం లేకుండా చప్పటి ఆహారం వీళ్లు ఎలా తింటారా? అని ఆశ్చర్యపోతాను. నేను దాన్ని స్టోరీలో రాయాలని
అనుకున్నాను. ఆ కథలో  ఇదే పెద్ద వస్తువైంది.
నిషాంత్‌ ఇంజమ్‌: (చదువుతున్నాడు) క్యాబ్‌లో వెళ్లుతుండగా మా నాన్న నన్ను ఎలా ఉన్నావు? బాగున్నావా? వంటి కుశల ప్రశ్నలు అడుగుతాడు. తర్వాత నేను వదిలి వెళ్లినప్పటి నుంచి ఈ నగరంలో మారిన ప్రతి విషయాన్ని ఏకరువు పెడతాడు. నాకు ఇష్టమైన ఆహారం గురించి మా అమ్మ ఆరాలు తీస్తుంది. ఆ క్షణాలను నేను తప్పక
ఎంజారు చేస్తాను. చిన్నప్పుడు పొందిన ఈ ఆప్యాయతను నేను చాలా మిస్‌ అవుతున్నాను.
నిషాంత్‌ ఇంజమ్‌ మన తెలంగాణ పిలగాడు. అమెరికా వలసవెళ్లాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రస్తుతం మిచిగాన్‌లో ఉంటున్న నిషాంత్‌ ఇంజమ్‌ తన వలస జీవితాన్ని, తొలినాళ్లలో ఎదురైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చి చిన్న కథలుగా రాశాడు. ఆ చిన్ని కథల సమాహారాన్ని ‘ది బెస్ట్‌ పాజిబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌’ పేరిట పుస్తకంగా తీసుకువచ్చాడు. ఈ పుస్తకం ఇప్పుడొక సంచలనం. పుట్టి పెరిగిన సంస్కృతి నుంచి కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ సాంస్కృతికంగా, మానసికంగా ఎదురయ్యే అంశాలను ఒక్కొక్కటి చిన్న చిన్న కథల రూపాల్లో మన ముందుకు తెచ్చాడు. న్యూయార్క్‌ టైమ్స్‌ సహా దిగ్గజ సంస్థలు ఆయన పుస్తకాన్ని రికమెండ్‌ చేస్తున్నాయి. కనుచూపులో దొర్లిపోయే అనేక సూక్ష్మ విషయాలను గుర్తించి పెద్ద చర్చకు పెట్టాడు. నిషాంత్‌ ఇంజమ్‌ను కదిలించినప్పుడు చెప్పిన విషయాలు ఇవి. లేట్‌ ఎందుకు ఓ లుక్కేద్దాం పదండి..
నిజం. ఈ దేశంలో వలసవచ్చినవారిని గొప్పగా చెబుతుంటారు. కానీ, వలసవచ్చిన వాడు చెల్లించుకునే మూల్యం వ్యక్తిగతస్థాయిలో ఉంటుందని అనుకుంటాను. కేవలం నీలోని నువ్వును కోల్పోవడమే
కాదు, నీ జ్ఞాపకాలూ కరిగిపోతుంటాయి. ఎందుకంటే జ్ఞాపకాలనేవి ప్రాంతానికి లంగరు వేసిఉన్నట్టే ఉంటాయి. నీవు ఎప్పుడైనా వలస వెళ్లినప్పుడు నీ జ్ఞాపకాలను నీవు అంత  సులువుగా యాక్సెస్‌ చేయలేవు. పుట్టిన ప్రాంతంలో పెరిగి ఉంటున్నవారితో పోల్చితే వలసవెళ్లినవారి జ్ఞాపకాలు వారికి దూరంగా జరిగిపోతాయి. నిషాంత్‌ ఇంజమ్‌  చదువుతున్నదానిలో ఆ క్యారెక్టర్‌ తన ఇంటికి వెళ్లాక ఏమేమి కోరుకుంటున్నాడో ఈ కథ వివరిస్తున్నది.

ఇంజమ్‌: (చదువుతూనే) కొన్ని నిమిషాల తర్వాత నా తల్లిదండ్రులు వాదులాడుకోవడం అనివార్యమే. వాళ్లు అలాగే ఉన్నారు. దీనికి పరిష్కారాన్ని వారు కనుగొనలేకపోతారు. నేను మళ్లీ ఆందోళనలో పడిపోతాను. ఇప్పటి క్షణాల వరకున్నంత ఆనందంగా మళ్లీ నేను ఎప్పటికీ ఉండలేను. ఆ మాయాజాలం ముగిసిపోయింది. మళ్లీ ఎప్పటి మంద్రసమయమే. కొన్నేళ్లపాటు గడిపిన దేశానికి మళ్లీ ఎగిరిపోవాలా? అక్కడ మళ్లీ పనికి వెళ్లాలా? అని లిప్తకాలంపాటు ఆలోచిస్తాను. కానీ, నా తల్లిదండ్రుల కోసం ఆ పని చేయలేను. వాళ్ల ముఖాలు ఇంకా నిండుగా ఉన్నాయి. నాకు అప్పుడనిపిస్తుంది.. దూరాలే మన ప్రేమ ద్వీపాన్ని వెలిగిస్తాయేమో.
నిషాంత్‌ ఆ చివరి వ్యాఖ్య అమోఘం. దూరాలే మన ప్రేమ ద్వీపాన్ని వెలిగిస్తాయేమో. దూరంగా ఉండి దగ్గరుండటాన్ని గురించి చాలా బాగా చెబుతున్నది. ఈ పాత్ర కథలో షికాగో ట్రిబ్యూన్‌కు పని చేస్తున్నది. నీకు కూడా అదే కంపెనీలో పని చేశావు. ఆ పాత్ర గురించి, నీకు ఆ పాత్రకు మధ్య పోలికల గురించి మాకు వివరిస్తావా?

ఈ పాత్ర నా జీవితానికి దగ్గరగా చిత్రితమైంది. నేను కూడా షికాగో ట్రిబ్యూన్‌లో పని చేస్తాను, నేను కూడా ఇంటికి వెళ్లి వస్తుంటాను. అంతేకాదు, నేను కూడా ఇంటికి వెళ్లడానికి ముందే నెలలు లెక్కిస్తాను. ఆ విధంగా నేను ముందుగానే మా ఇంటినైపోతాను. అలా నా కుటుంబానికే కాదు గతంలో ఆ ఇంటిలో పెరిగిన నాలోని నాకు కూడా దగ్గరవుతాను. వలస అనేదే ఒక విధమైన ప్రయాణం.

ఆసక్తికరంగా ఉన్నది. నీవు చెప్పేది నిజం. ఇది నీలోని ఒక వెర్షన్‌కు ముగింపు. ఒక విధంగా నీలోని మరో వెర్షన్‌ను సృష్టిస్తున్నావు. నిజం. ఈ దేశంలో వలసవచ్చినవారిని గొప్పగా చెబుతుంటారు. కానీ, వలసవచ్చిన వాడు చెల్లించుకునే మూల్యం వ్యక్తిగతస్థాయిలో ఉంటుందని అనుకుంటాను. కేవలం నీలోని నువ్వును కోల్పోవడమే కాదు, నీ జ్ఞాపకాలూ కరిగిపోతుంటాయి. ఎందుకంటే జ్ఞాపకాలనేవి ప్రాంతానికి లంగరు వేసి ఉన్నట్టే ఉంటాయి. నీవు ఎప్పుడైనా వలస వెళ్లినప్పుడు నీ జ్ఞాపకాలను నీవు అంత సులువుగా యాక్సెస్‌ చేయలేవు. పుట్టిన ప్రాంతంలో పెరిగి ఉంటున్నవారితో పోల్చితే వలసవెళ్లినవారి జ్ఞాపకాలు వారికి దూరంగా జరిగిపోతాయి.

ఈ పుస్తకం చిన్న కథల సంకలనం. అన్ని కథలూ వలస అనుభవాల్లోని ఏదోక అంశాన్ని స్పృశిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని స్వదేశంలోనివైతే.. మరికొన్ని వలసవెళ్లిన దేశంలోని అనుభవాలను చర్చిస్తున్నాయి. ఇది నీ తొలి పుస్తకం. ఈ పుస్తకం వలసపైనే ఎందుకు రాయాలని అనుకున్నావు?
నేను చాలా నిజాయితీగా ఉంటాను. నేను ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు ఒక ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లాను. అక్కడ ఓ అధికారిని చూశాను. ఆయన నాకేమో చెబుతున్నాడు. ఆ మాటలు అర్థం చేసుకోవడానికి గింజుకున్నాను. వెంటనే నాలో ఓ భావం పొంగివచ్చింది. నా జీవితంలోనే అతిపెద్ద తప్పు చేస్తున్నానేమో అనేది ఆ భావన.
ఓహ.. అలాగా!
నేను ఇక్కడ జీవించలేననో, అమెరికాకు అలవాటుకాలేనేమోనని కాదు. అది నాకు సాధ్యమే. ఇది నాలో పెరుగుతున్న బాల్యానికి చెందిన భావన. బాల్యంలో మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. వాళ్లు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియదు. కానీ, ఒక రోజు ఆ దేశంలో, ఆ సంస్కృతిలో నువ్వో భాగమైపోతావు. అప్పుడే నువ్వు ఆ ప్రజలను చదవగలగుతావు. వారిని అర్థం చేసుకోగలుగుతావు. వారి ఆలోచనలనూ విశ్లేషిస్తావు. చిన్నప్పుడు మనం ఇవి నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో ఈ కొత్త దేశంలో ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు అన్ని సంవత్సరాలు పట్టింది.

నీవు రాసిన కొన్ని కథల గురించి అడగాలను కుంటున్నాను. అందులో ది ఇమ్మిగ్రెంట్‌ అనే కథ ఉన్నది. వలసవచ్చినవారు కొన్ని మర్యాదలు నేర్చుకోవాలని పేర్కొంటావు. ఉదాహరణకు డియోడరెంట్‌ చల్లుకోవాలని, ప్రజల్లో ఉన్నప్పుడు వట్టి చేతులతో భుజించరాదని వలసవచ్చినవారు నేర్చుకోవాలని చర్చిస్తావు. నీవు కొత్తగా అమెరికా వచ్చినప్పుడు నీకు ఆశ్చర్యకరంగా ఎదురైనా ఇలాంటి అనుభవాలేమైనా ఉన్నాయా?

కచ్చితంగా చాలా ఉన్నాయి. అందులో టాయిలెట్‌ పేపర్‌కు సంబంధించినది కూడా.. (నవ్వులు) నీ పుస్తకంలో ఈ భాగం చాలా ఫన్నీగా ఉన్నది. థాంక్యూ. అప్పటి వరకు నా జీవితంలో నేను టాయిలెట్‌ పేపర్‌ రోల్‌ పట్టుకోలేదు.

అంటే నీవు బిడెట్‌(టాయిలెట్‌ బేసిన్‌ వద్ద శుభ్రం చేసుకోవడానికి ఉండే పరికరం) కోసం వెతుకుతున్నావని చెప్పాల్సి వస్తుంది. చాలా మంది అమెరికన్లకు వెనుక భాగాన్ని నీటితో శుభ్రం చేసుకుంటారని తెలియదని నా దృష్టికి రావడం ఫన్నీగా అనిపించింది. మనం మన వెనుకభాగాన్ని పేపర్‌తో తుడుచుకోవాల్సి ఉంటుందటే నమ్మలేం. ఇది రెండు సంస్కృతులు కలిసినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ. ఆ కోణంలో ఇంకేమైనా చెప్పాల్సినవి ఉన్నాయా?

అమెరికాలో ప్రజా రవాణ వ్యవస్థపై నాకెప్పుడూ ఆశ్చర్యమే అనిపిస్తుంది. అలాగే.. చాలా మంది ఎందుకు సబర్బ్‌లలో జీవిస్తారో అనే ప్రశ్న కూడా చాన్నాళ్ల నుంచి ఉన్నది. ఎందుకంటే..

ఓహ.. ఇంట్రెస్టింగ్‌.
ఇంజమ్‌: … నేను ఎన్నడూ దాన్ని ఊహించలేదు.

చాలా సంస్కృతుల్లో అత్యంత ప్రాధాన్యమైన ఆహారం గురించి కూడా నువ్వు రాశావు. చాలా మంది వలసవెళ్లినవారి అనుభవాల్లోనూ ఇది ముఖ్యంగా ఉంటుంది. నువ్వు లంచ్‌ ఎట్‌ ప్యాడీస్‌ అనే హాస్య కథ రాశావు. ఆహారం కూడా కొన్నిసార్లు ఆందోళనకారకంగా ఎలా ఉంటుందో వర్ణించావు

భారత రెస్టారెంట్‌లలోనూ ఎవరైనా ఇది చాలా కారంగా ఉన్నదని చెబుతానే ఒప్పుకోను. అంతేమీ కారం లేదే అనేదే నా వ్యక్తిగత అనుభవంగా ఉంటుంది. కానీ, కారం లేకుండా చప్పటి ఆహారం వీళ్లు ఎలా తింటారా? అని ఆశ్చర్యపోతాను. నేను దాన్ని స్టోరీలో రాయాలని అనుకున్నాను. ఆ కథలో ఇదే పెద్ద వస్తువైంది.

లంచ్‌ ఎట్‌ ప్యాడీస్‌ కథలో ఈ ఇండియన్‌ అబ్బాయి తన వైట్‌ ఫ్రెండ్‌ను లంచ్‌కు ఆహ్వానిస్తాడు. ఆ బాలుడి తండ్రి ఆదుర్దాలో పడిపోతాడు. ఆ శ్వేతజాతి బాలుడు ఏం తింటాడా? సాలడ్‌లో ఏం వేయాలా? శాండ్‌విచ్‌ చేయడం ఎలాగా? ఇదంతా చాలా ఫన్నీగా ఉంటుంది. ఒక సామాన్య భారత కుటుంబం ఆ ఆహారాన్ని తినదు.

అవును. నేను ఇక్కడికి వచ్చే వరకు శాండ్‌విచ్‌ రుచి ఎరుగను. పాస్తా కూడా తిననేలేదు. సాలడ్‌లో ఏముంటాయో కూడా తెలియదు.
(నవ్వులు)
ఈ పదాల అర్థాలేమిటీ? వాటిలో ఏముంటాయి? ఇవి నేర్చుకోవడం తప్పకుండా నా అనుభవాల్లో భాగమే.

ట్విట్టర్‌లో నువ్వు చేసిన ఓ పోస్టు చూశాను. ‘ఈ దేశంలో ఏడేళ్ల క్లిష్ట సమయంలో ఈ పుస్తకం రాశాను. ఈ పుస్తకం రాసే క్రమంలో నేను ఇష్టపడ్డ ఎన్నింటినో కోల్పోయాను. ఏదీ ప్రయోజనంగా కానరాని సమయాల్లో ఈ పుస్తకమే నన్ను ముందుకు నడిపించింది’ అని నువ్వు రాసుకున్నావు. ఇది చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఈ పుస్తకం చాలా అందంగా, సంపన్నంగా ఉన్నది. చదువుతూ చాలా ఎంజారు చేశాను. కానీ, ఈ పుస్తకం బాధాతప్త సమయాల్లో జనించిందని తెలుసుకున్నాను. అలాంటి సమయాల్లో, ఒంటరితనంలో లేదా సంతోషమయ కాలంలోనూ ముందుకు సాగడానికి ఈ పుస్తకం ఊతం ఇచ్చిందా?
కచ్చితంగా. ఉదాహరణకు, ఈ హాస్యభరిత సన్నివేశాలు రాయడం కొన్ని సార్లు సరదాగా.. మరికొన్ని సార్లు థెరపాటికిగానూ ఉండేవి. నేను ట్రిబ్యూన్‌లో పని చేస్తున్నప్పుడు, నన్ను నేను తమాయించుకోవడానికి – ఎందుకంటే నాకు ఊపిరాడనట్టు అనిపించేది. నేను ఇండియాకు తిరిగివెళ్లలేను అనిపించేది. నేను జాబ్‌ కూడా చేయలేనేమో అనిపించేది. నిష్క్రమించనూ లేను. నా మెడ చుట్టూ ఏదో గొలుసు ఉన్నట్టు అనిపించేది. ఆ భావన నుంచి బయటపడటానికి రాయడం మొదలుపెట్టాను. ఒక ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని సృష్టించడం మొదలుపెట్టాను. అందులో నేను స్వేచ్ఛగా ఉండొచ్చు. ఒక విధంగా అందులో నేను నాలోని నాకు, నా ఇంటికి సామీప్యంగా ఉండొచ్చు. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు వాస్తవ ప్రపంచంలో చాలా నష్టపోయాను. ఒకదాని వెంట మరొకటి నష్టపోయాను. నేను సృష్టిస్తున్న ప్రపంచాన్ని సాధ్యమైనంత వరకు సజీవంగా ఉంచడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నేనొక సౌందర్యాన్ని చూడాలనుకున్నాను. తద్వార నేనొక అర్థవంతమైన జీవితాన్ని జీవించగలను అని అనుకున్నాను.

నిషాంత్‌ ఇంజమ్‌ ఈయనే. ‘ది బెస్ట్‌ పాజిబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌’ పుస్తక రచయిత. థాంక్యూ వెరీ మచ్‌
థాంక్యూ….
ఈ హాస్యభరిత సన్నివేశాలు రాయడం
కొన్ని సార్లు సరదాగా.. మరికొన్ని సార్లు థెరపాటికిగానూ
ఉండేవి. నేను ట్రిబ్యూన్‌లో పని చేస్తున్నప్పుడు, నన్ను నేను
తమాయించుకోవడానికి – ఎందుకంటే నాకు ఊపిరాడనట్టు
అనిపించేది. నేను ఇండియాకు తిరిగివెళ్లలేను అనిపించేది. నేను జాబ్‌ కూడా చేయలేనేమో అనిపించేది. నిష్క్రమించనూ లేను. నా మెడ చుట్టూ ఏదో గొలుసు ఉన్నట్టు అనిపించేది. ఆ భావన నుంచి బయటపడటానికి రాయడం మొదలుపెట్టాను. ఒక ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని సృష్టించడం మొదలుపెట్టాను. అందులో నేను స్వేచ్ఛగా ఉండొచ్చు. ఒక విధంగా అందులో నేను నాలోని నాకు, నా ఇంటికి సామీప్యంగా ఉండొచ్చు. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు వాస్తవ ప్రపంచంలో చాలా నష్టపోయాను. ఒకదాని వెంట మరొకటి నష్టపోయాను. నేను సృష్టిస్తున్న ప్రపంచాన్ని సాధ్యమైనంత వరకు సజీవంగా ఉంచడానికి ప్రయత్నించాను. ఎందుకంటే నేనొక సౌందర్యాన్ని చూడాలనుకున్నాను.
తద్వార నేనొక అర్థవంతమైన జీవితాన్ని
జీవించగలను అని అనుకున్నాను.
– మహేష్‌
(npr.org సౌజన్యంతో…)