హైదరాబాద్ : నితీశ్ రెడ్డి (122, 194 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు), వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్, 141 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో మెరువగా.. కెప్టెన్ తిలక్ వర్మ (44, 73 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. దీంతో మేఘాలయతో రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్ ఫైనల్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 87.5 ఓవర్లలో 350 పరుగులు చేసింది. మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులే చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 0/1తో ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల వెనుకంజలో నిలిచింది.