నియోజకవర్గానికోకా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నియోజక వర్గానికొక ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పాఠశాలల ఏర్పాటుపై ఆదివారం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్కిటెక్చర్స్‌ రూపొందించిన పలు నమూనాలను వారు పరిశీలించారు. ఒకే చోట ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓబీసీ,మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయాలనీ, పైలట్‌ ప్రాజెక్ట్‌గా కొడంగల్‌, మధిర నియోజవర్గాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్‌, మధిర నియోజకవర్గాల్లో 20ఎకరాలచొప్పున భూమిని ప్రభుత్వం సేకరించింది.