రబీ సాగుకు నిజాం సాగర్ నీటి విడుదల

నవతెలంగాణ –  నిజాంసాగర్
నిజంసాగర్ జలాశయం నుంచి ప్రధాన కాలువలోకి గురువారం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఇంజనీర్ శివ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సాగుకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నీటిని అనవసరంగా వృధా చేయొద్దని ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు , దానిలో 1401.97 అడుగుల నీరు ఉందని ఆయన తెలిపారు.