నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని వర్ని రోడ్ సాయినగర్ నాయి బ్రాహ్మణ సంఘంలో ఆత్మీయ సమ్మేళనం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ అలి షబ్బీర్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తా అని నట్టేట ముంచిన కేసీఆర్ ప్రభుత్వం గురించి వివరించారు. మీ దుకాణ సముదాయాలకు ఉచితంగా కరెంటు ఇస్తానని మీకు ఆర్థికంగా సహాయం చేసి ఆదుకుంటానని మాట తప్పి బీసీ బందు ఇస్తానని మీ దుకాణాలు బందు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. కార్పొరేట్ సంస్థల నుండి మీ కులవృత్తికి ముప్పు ఏర్పడింది. కార్పొరేట్ సంస్థలతో కొమ్ముకై పేదలైన మీ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీలో ఎవరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు బీసీ బందులో 30% కమిషన్ అది కూడా వారి కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీ అందరిని ఆదుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేసి గెలిపించి మీ సమస్యలను నెరవేర్చుకోండి. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు పథకాలను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అమలు చేసాం. ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఇంట్లో అర్హులైన వారందరికీ పెన్షన్లు, పెళ్లయిన ఆడపడుచులకు 2500 చేయూత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మరెన్నో పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగు నింపుతాం అని తెలియజేశారు.