నవతెలంగాణ-కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్అండ్ గేమ్స్ మీట్- 2025 కరీంనగర్ లో జరిగాయి. ఈ మీట్ లో బాసర జోన్-2, తరపున నిజామాబాద్ క్రీడాకారులు సత్తా చాటడం జరిగింది .వివిధ రంగాలలో 61మంది క్రీడాకారులు పాల్గొని, 26 పతకాలు సాధించడం జరిగింది. క్రీడాకారులను నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్.సింధు శర్మ, ఐ.పీ.ఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో, అడిషనల్ డీ.సీ.పీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, అడిషనల్ డీ.సీ.పీ (ఏ.ఆర్) కె. రామ్ చందర్ రావ్, స్పెషల్ బ్రాంచ్ ఏ.సి.పి, శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు హెచ్ .సతీష్(అడ్మిన్), యు. తిరుపతి (ఎం టి ఓ), కె. శ్రీనివాస్ (వెల్ఫేర్), శేఖర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.