నిజామాబాద్ హెచ్ ఎఫ్ సి రెస్టారెంట్ ప్రారంభించిన నుడా చైర్మన్ 

నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే  బైపాస్ రహదారిలో హెచ్ ఎఫ్ సి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ను శుక్రవారం నుడా చైర్మన్ కేశ వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ.. హెచ్ ఎఫ్ సి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ప్రారంభం అవ్వడం ఎంతో సంతోషదాయకమని, ప్రజలకు నాణ్యమైన ఫుడ్ ను అందించే విధంగా అందుబాటులో ఉంచారన్నారు. నగర ప్రజలు అందుబాటులో ఉన్న హెచ్ ఎఫ్ సి ను సంప్రదించి టెస్ట్ చేయాలని సూచించారు. అదేవిధంగా హెచ్ఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకు, ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నారని అదేవిధంగా ఎవరైనా బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న సతీష్ ని సంప్రదిస్తే ఏ విధంగా బిజినెస్ పెట్టుకోవాలో చెప్పి కృషి చేస్తారని కేశవ వేణు అన్నారు. 22వ అవుట్ లెట్ ను, నిజామాబాద్ నగరానికి చెందిన, డికొండ సతీష్ తీసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ ఎఫ్ సి నిజామాబాద్ ఫ్రాంచ్యాసి యజమాని ఢీకొండ సతీష్ మాట్లాడుతూ.. హెచ్ ఎస్ సి రెస్టారెంట్లో, నాణ్యతకు కూడిన, వెజ్, నాన్ వెజ్ డిషెష్ లు అందుబాటులో ఉంటాయని, ఎప్పటికప్పుడు, ఫ్రెష్ డిషెస్ అందుబాటులో ఉంటాయని, ధరల విషయంలో కూడా ఎకనామికల్ గా ఉంటాయని, నాణ్యతతో కూడిన మంచి ఫుడ్ ఐటమ్స్ తమ వద్ద అందుబాటులో ఉంటాయని ఢీకొండ్ సతీష్ అన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎఫ్సీ సీఈఓ సిహెచ్ సతీష్ మాట్లాడుతూ.. నిజమాబాద్ పరిసర ప్రాంతాలలో ఎవరైనా ఫ్రాంచేసి కోసం ఆసక్తి గలవారు ఉంటే, నిజామాబాద్ లో డీమార్ట్ నుంచి హైదరాబాద్ వచ్చే రహదారిలో హెచ్ ఎఫ్ సి అవుట్లైట్ కు వచ్చి టేస్ట్ చేసి, డికొండ సతీష్ ను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎఫ్ సి సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు
తదితరులు పాల్గొన్నారు.