నవతెలంగాణ – మోపాల్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ స్థానంపై రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షింప చేస్తుంది గత ఎన్నికల్లో మాజీ సీఎం కూతురు ప్రస్తుతం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేసి ఓటమిపాలైంది. దాదాపు జిల్లాలో పార్లమెంట్ పరిధిలో అన్ని ఎమ్మెల్యే స్థానాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకున్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది ముఖ్యంగా కొందరి ఎమ్మెల్యేలే ఆమె ఓటమికి కారణమయ్యారని బహిరంగ రహస్యంగా కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మళ్లీ అవి పార్లమెంటు వెళ్తే ఎక్కడ మాదిపత్యం కోల్పోతామని నియోజకవర్గంలో మా పెత్తనం తగ్గుతుందని ఆమె ఓడితే నియోజకవర్గంలో తమే రాజ్యమేలుతామని అందుకే ఓటమికి కారణమయ్యారు. ఈ ప్రస్తుత పార్లమెంటు ఎలక్షన్స్ కి ఆమె పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘోరంగా ఓటమి చెందినందువల్ల ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది అందులో ప్రధానంగా రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం మరియు అందులోనూ మోస్ట్ సీనియర్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు ఉంది. దాదాపు మూడు నియోజకవర్గాలు విజయకేతనం ఎగరవేసినందున ఆయనపై టీఆర్ఎస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. టికెట్ ఎవరికి వరిస్తుంది వేచి చూడాలి.కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది కానీ ఎందరున్నా కూడా ప్రముఖంగా సినీ నిర్మాత నిజామాబాద్ జిల్లా వాసైనా నర్సింపల్లి గ్రామానికి చెందిన దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన చాలా సంవత్సరాల నుండి మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇందూరు తిరుమలక పుణ్యక్షేత్రం ద్వారా చాలామంది చిన్నపిల్లలకు ప్రకృతి పరమైన ఔషధన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు .అలాగే గర్భిణి స్త్రీల కూడా ఉచితంగా ఔషధాన్ని ఇవ్వడంతో స్థానికులే కాకుండా జిల్లా నలుమూల నుండి కూడా అక్కడికి వచ్చి ఔషధాన్ని ఉచితంగా స్వీకరించడం జరుగుతుంది. చాలామంది కాంగ్రెస్ నాయకులకు కూడా దిల్ రాజుకు టికెట్ వస్తే కచ్చితంగా గెలిపించి తీరుతామని అటువంటి కల్మషం లేని వ్యక్తి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం కంటే అంతకంటే ఇంకేం కావాలని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు వ్యక్తిగతంగాను, సౌమ్యుడిగా అందరితో కలుపుకపోయే వ్యక్తిని అతనిని దగ్గరగా చూసిన వాళ్ళు ఎప్పుడు చెబుతు ఉంటారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా దిల్ రాజుకు దగ్గరికి వెళ్తే తమ సమస్య తీరుతుందని అక్కడ స్థానిక ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తి ఈరోజు పార్లమెంట్ వ్యక్తి అయితే ఇంకా మా మండల గ్రామ సమస్యలతో పాటు జిల్లా సమస్యలు కూడా తీరుతాయని ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరి నాయకులు ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా దిల్ రాజుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మాజీమంత్రి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుల హోదాలో జిల్లాలో పర్యటించినప్పుడు ఇందూరు తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని వెళ్లారు. ఇక్కడ వాతావరణాన్ని చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కచ్చితంగా దిల్ రాజుకి ఈసారి పార్లమెంట్ టికెట్ వస్తే ఇందూరు గడ్డపై మరోసారి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి విజయకేతనo ఎగురవేస్తారని కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజుకి టికెట్ కేటాయిస్తే గ్రూప్ రాజకీయాలు లేకుండా అందరు కలిసికట్టుగా పనిచేసే ఆయన విజయానికి అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు తన సొంత ఇంట్లో వ్యక్తి పోటీ చేసే ఇంత కష్టపడతామో ఆ విధంగా కష్టపడతామనీ బహిరంగంగానే చెబుతున్నారు పది సంవత్సరాల నుండి తమ పార్టీ రాష్ట్రంలోని కేంద్రంలో అధికారములో లేదని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈసారి పార్లమెంట్లో కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని దిల్ రాజును గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని కార్యకర్తలు తెలుపుతున్నారుభారతీయ జనతా పార్టీలో దాదాపు సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు దాదాపు ఆయనే భాజాపా అభ్యర్థిగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ అరవింద్ కి స్వంత పార్టీలోనే వ్యతిరేకవర్గం చాలా మంది సీనియర్లు అందరినీ పక్కనపెట్టి జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు ఇటీవల అసెంబ్లీ టికెట్ విషయంలో కూడా తన మార్కు చూయించాడు. జిల్లాలో పార్టీని తన కంట్రోల్లో పెట్టుకుని తన నచ్చిన వారికి టికెట్లు కానీ పార్టీ అధ్యక్షులు పదవి కాని ఇస్తున్నాడని, సంవత్సరాల నుండి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులను పక్కన పెట్టాడని తనకు నచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడని చాలామంది కార్యకర్తలు కృంగిపోతున్నారు, దీనివల్ల పార్టీలో వ్యతిరేక వర్గం చాలానే ఉంది సమయం చూసి దెబ్బ కొట్టాలని కొందరు నాయకులు ఎదురుచూస్తున్నారని బహిరంగ రహస్యం. ఇక నిజామాబాద్ పార్లమెంట్ బాదుషా ఎవరు అని అతి కొన్ని రోజుల్లో తెరపడనుంది. ముఖ్యంగా పార్లమెంటు పోటీ చేసే వ్యక్తి దాదాపు 50 కోట్లకు పైబడి ఖర్చు పెట్టాలని కొందరు లోలోపల భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే మొన్న జరిగినా అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి 15 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారని ఇప్పుడు తన పార్లమెంట్ పరిధిలో దానికి నాలుగు రేట్లైనా ఎక్కువగా పెట్టాల్సిందే అనే కొందరు పార్టీల పోటీ చేసే వ్యక్తులు భయపడుతున్నారు. ఇప్పటికైనా కొత్తగా పార్లమెంట్ గెలిచిన వ్యక్తి జిల్లా సమస్యలపై పోరాడి అత్యధికంగా నిధులు సాధించాలని ప్రజలు కోరుతున్నరు ముఖ్యంగా రైల్వే లైన్ విషయంలో జిల్లాకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుందని ఇప్పుడు కొత్తగా వచ్చే పార్లమెంట్ పార్లమెంట్ వ్యక్తి అయిన జిల్లాపై కనికరం చూపాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.