దరఖాస్తులకు ఆహ్వానించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ 

నవతెలంగాణ కంటేశ్వర్
అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్, (షీ టీమ్స్ మరియు భరోసా ), తెలంగాణ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు నిజామాబాద్ లో కొత్తగా ఏర్పాటు కాబోతున్న భరోసా సెంటర్ యందు తాత్కాలిక ప్రాతిపాధికన ఎంపికకోసం ఆసక్తి గల వారు తెలియజేసిన విధంగా ధరఖాస్తులు చేసుకోగలరు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ జయరాం శుక్రవారం తెలియజేశారు.భరోసా సెంటర్ నిజామాబాద్ జిల్లా యందు వివిధ కేటగిరిలో 5 ఖాళీలు గలవు అని తెలిపారు.లీగల్ సపోర్టింగ్ పర్సన్ ఖాళీలు 1,సపోర్టు పర్సన్స్ ఖాళీలు 2, రిసిప్షనిస్టు ఖాళీలు 1, ఎ.ఎన్.ఎమ్ ఖాళీలు 1
గలవు అని తెలియజేశారు.
లీగల్ సపోర్టింగ్ పర్సన్ :
మహిళా అభ్యర్థులు మాత్రమే వయస్సు 25 సం॥ నుండి 40సం|| లోపు ఉండాలి. నెలసరి జీతం : రూ॥ 22,000/- విధ్యార్హ త : ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎమ్ అనుభవం : 24 నెలల కంటే తక్కువ అనుభవం ఉండకూడదు, స్వతంత్రంగా లేదా సీనియర్ న్యాయవాదితో కలిసి మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన 10 కేసులకు తగ్గకుండా పరిష్కరించగలిగి ఉండాలి.
డి.వి / రేప్ / ఇతర ఫ్యామిలీ కోర్టు కేసులు / పోక్సో అనుభవం కలిగి ఉండాలి. పి.పి / డి.ఎల్.ఎస్.ఎ కి మద్దతు ఇచ్చిన అనుభవం ఉండాలి. క్లయింట్లు మరియు సాక్షులను బ్రీఫింగ్ చేసిన అనుభవం ( కనీసం 10 కేసుల్లో ) మాక్ ట్రాయల్స్ నిర్వహించడంలో అనుభవం కలిగి ఉండాలి.
సపోర్టు వర్సన్ :
మహిళా అభ్యర్థులు మాత్రమే, వయస్సు 25 సం॥ నుండి 35సం||లోపు ఉండాలి
నెలసరి జీతం: రూ. 20,000/-
విధ్యార్హత: సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్మెంటు / సైకాలజిస్ట్ పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ ఉండాలి.
అనుభవం : ధరఖాస్తు దారులు 12 నెలల కంటే తక్కువ అనుభవం ఉండకూడదు బాలల హక్కులు లేదా పిల్లల రక్షణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి లేదా స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ లేదా అలాంటి సంస్థతో కలిసి పనిచేసి ఉండాలి లేదా పిల్లల సంరక్షణలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్ లేదా షెల్టర్ హోమ్ అధికారి అయి ఉండాలి లేదా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఉద్యోగంలో అయినా ఉండాలి.
 రిసిప్షనిస్టు :
మహిళా అభ్యర్థులు మాత్రమే వయస్సు 25 సం॥ నుండి 35సం||లోపు ఉండాలి.
నెలసరి జీతం : రూ॥ 15,000/-
విధ్యార్హత : గ్రాడ్యూయేట్ అయి ఉండాలి మరియు కంప్యూటర్ లిటరేటు అయి ఉండాలి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడును.
అనుభవం : ధరఖాస్తు దారులు 24 నెలల కంటే తక్కువ అనుభవం ఉండకూడదు.
 ఎ.ఎన్.ఎమ్ :
మహిళా అభ్యర్థులు మాత్రమే వయస్సు 25 సం॥ నుండి 35 సం||లోపు ఉండాలి
నెలసరి జీతం : రూ॥ 16,000/-
విధ్యార్హ త : బి.ఎస్.సి నర్సింగ్
జి.ఎన్.ఎమ్ ( జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైఫరీ )
ఎ.ఎన్.ఎమ్ ( సహాయక నర్సు మరియు మిడ్వైఫరీ )
అనుభవం: గైనకాలజిస్ట్ / పిడియాట్రిషియన్ / సర్జన్తో 24 నెలలకు తక్కువకాకుండా పనిచేసిన అనుమభం ఉండాలి.లేదా ఐ.సి.యు  అత్యవసర అనుభవం ఉండాలిఎమ్.టి.పి / అబార్షన్, డెలివరీ విధానాలను చేపట్టి ఉండాలి లేదా సహయం చేసి ఉండాలి.
ధరఖాస్తుదారులు పూర్తి సమాచారంతో పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని ఇన్వార్డు సెక్షన్ యందు తేది: 29-12-2023 లోపు ఇవ్వగలరు అని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లాండ్ ఆర్డర్ జయరాం తెలియజేశారు.