గుమాస్తా సంగంతో సమావేశం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి

నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణం గంజ్ లో హమాలి సంఘం గుమస్తా సంఘం సభ్యులతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ సమావేశమయ్యి ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని సోమవారం కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత శ్రమజీవులకు నేడు బతుకు భద్రత లేదని సామాజిక భద్రత లేదనిఅన్నారు. ఉత్పత్తి పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న హమాలి అండ్ గుమస్తా వర్కర్స్ సేవలు చాలా ముఖ్యమైనవి ఆన్నారు. విరి సేవలు గనక నిలిచిపోతే సరుకులు ఎక్కడి అక్కడే ఉండిపోతాయని ప్రజల వద్దకు సరుకులు చేరకపోతే పరిస్థితులు తీవ్ర సంక్షోభంగా మారుతాయి అని అన్నారు. అలాంటి ముఖ్యమైన పాత్ర పోషించే శ్రమజీవులకు కనీస సామాజిక భద్రత కల్పించడంలో కెసిఆర్ ప్రభుత్వాము విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 600 రైస్ మిల్లు, మార్కెట్, వ్యవసాయ, ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల్లో  పట్టణ ప్రాంతాల్లో దుకాణాలలో సివిల్ సప్లై ఎఫ్సీఐ గోడౌన్ ట్రాన్స్పోర్ట్,  పరిశ్రమలలో లక్షల మంది హమాలీ గుమస్తా లు పనిచేస్తున్న వారినిదృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, వారికి కార్మిక సామాజిక భద్రత చట్టం ఏర్పాటు చేసి వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, పని భద్రత కల్పించి అర్హులైన ప్రతి హమాలీ కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, వివిధ సంస్థల పని చేస్తున్న హమాలీ కార్మికులందరికీ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించి, విరి న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తమన్నరు. హమాలి కార్మికులు గుమస్తాలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.