
నవతెలంగాణ కంఠేశ్వర్ :
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిని సబ్బాని లతకు బీఫామ్ బిఎల్ఎఫ్ చైర్మన్ కామ్రేడ్స్ నల్ల సూర్య ప్రకాష్ చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు.ఎంసిపిఐయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాల అశోక్ ఓంకార్, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, నిజామాబాద్ అర్బన్ బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సబ్బని లత లు తదితరులు పాల్గొన్నారు. ఓంకార్ భవన్ హైదరాబాద్ లో జరిగిన బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశం లో నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడిన బిఎల్ఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో బిసి ముఖ్యమంత్రి ముఖ్యంగా మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఎంబిసి) ముఖ్యమంత్రి ని చేయడం కోసం ఓటు హక్కు ద్వారా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎంసిపిఐయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ మార్క్సిజం- అంబేడ్కరిజంల అన్వయింపుల సైద్ధాంతిక రాజకీయ దృక్పథంతో పని చేస్తున్న బిఎల్ఎఫ్ ద్వారా మాత్రమే సామాజిక న్యాయం అమలు జరుగుతుందన్నారు. కేంద్రంలో మోదీ బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వల్ల ప్రజలు ఆర్థిక దాడిని ఎదుర్కొంటున్నారని విమర్శించారు .రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ బలపరుస్తున్న అభ్యర్థిలను గెలిపించాలని కోరారు.