సీనియర్ బాల్ బ్యాట్మెంటన్ క్రీడ పోటీల్లో సెమీఫైనల్ లో నిజామాబాద్ మహిళా

నవతెలంగాణ-కంఠేశ్వర్ : ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ గ్రౌండ్స్ బాల్నగర్ సికింద్రాబాద్ లో జరుగుతున్నటువంటి రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ మహిళా మరి పురుషుల క్రీడా పోటీల్లో నిజామాబాద్ మహిళా జట్టు, కరీంనగర్ జట్టుపై 35 -27,35- 27, తేడాతో రంగారెడ్డి జట్టు పై 35-23,35-22, తేడాతో, నల్గొండ జట్టుపై 35-21,35-24 తేడాతో, వరంగల్ జట్టుపై 35-30,35-29, తేడాతోవిజయం సాధించి పూల్ విన్నర్స్ గా నిలిచి సెమీఫైనల్సెమీఫైనల్ చేరడం జరిగింది. సెమీఫైనల్ చేరినటువంటి జట్టును జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు మానస గణేష్, ప్రధాన కార్యదర్శి శ్యామ్,వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, సలహాదారులు ఎన్వి హనుమంత్ రెడ్డి,జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్  ఉపాధ్యక్షులు కిషన్, కిషోర్,రంజిత్,రాజ్ కుమార్ కోశాధికారి  రాజేశ్వర్, కృష్ణమూర్తి సంఘ సభ్యులు   సురేందర్, నాగేష్, నీరాజారెడ్డి,  వినోద్, సంజీవ్, మహేష్, సురేష్,శ్రుపాన్,సాయిబాబా, మాధురి, భాగ్యశ్రీ,స్వప్న,భాగ్యఅభినందించారు.