నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగారంకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డా. సౌమ్య మిశ్రా రానున్నారు. నిజామాబాద్ జిల్లా జైలులో సోమవారం వివింగ్ యూనిట్ ప్రారంభానికి డిజి వస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా జైలు సందర్శనతో పాటు వివింగ్ యూనిట్ ప్రారంభ వేడుకలలో జైళ్ళ శాఖ వరంగల్ రేంజ్ డిఐజి సంపత్ తో పాటు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మలు,ఇతర అధికారులు పాల్గొననున్నారు అని తెలిసింది.