ఎన్‌ఎండిసి కొత్త ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఏర్పాటు

ఎన్‌ఎండిసి కొత్త ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఏర్పాటు– హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో నిర్మాణం
హైదరాబాద్‌ : ప్రముఖ ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు ఎన్‌ఎండిసి లిమిటెడ్‌ హైదరాబాద్‌ పటాన్‌చేరులో కొత్త పరిశోధన, అభివృద్థి (ఆర్‌అండ్‌డి) సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మంగళవారం దీనిని ఆ సంస్థ సిఎండి అమితవ ముఖర్జీ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఆర్‌అండ్‌డి కోసం రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టామన్నారు. కొత్త ఆర్‌అండ్‌డి సెంటర్‌ కోసం రూ.50 కోట్లు వ్యయం చేశామన్నారు. ఆర్‌అండ్‌డి ద్వారా భారతీయ మైనింగ్‌ పరిశ్రమను స్థిరమైన భవిష్యత్తు వైపు ఆవిష్కరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాము ఇక్కడ పరిశోధనలో మాత్రమే పెట్టు బడి పెట్టడం లేదని.. దేశ భవిష్యత్తు కోసం వ్యయం చేస్తున్నామన్నారు. కొత్త సెంటర్‌లో అత్యాధునిక ప్రయోగశాలలు ఉన్నాయి. ఇవి సుస్థిర ఖనిజ సాంకేతికత. ధాతువు శుద్దీకరణలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి. నిపుణుల బందంచే నిర్వహించబడుతుందని ఆ వర్గాలు తెలిపాయి.