నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్)కు 2024-25 విద్యాసంవత్సరంలో ఎంపికైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువు వచ్చేనెల 31వ తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్‌ఎస్‌పీ) ద్వారా దరఖాస్తుల పునరుద్ధరణ, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అప్‌లోడ్ చేసే గడువు వచ్చేనెల 31 వరకు ఉందని తెలిపారు. సకాలంలో దరఖాస్తు చేసేలా విద్యార్థులకు వివరించాలని సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు https://scholorships.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.