నీళ్ళూ, నిధులు, నియామకాలు ఏవీ?

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
నీళ్ళు, నిధులు, నియామకాలు నినాదంతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో పాలనా కాలం వెల్ల బుచ్చుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. గత నాలుగు రోజులుగా సమస్యలు పరిష్కారం కోసం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల కూడలి లో అంగన్వాడీ లు చేపట్టిన నిరవధిక సమ్మె శిభిరం సందర్శించి వారికి మద్దతు ప్రకటించి గురువారం ఆయన ప్రసంగించారు. అధికారంలో కి రాకముందు ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ పద్దతులను హేళనగా చేసిన ఆయనే నేటికీ అనే పథకాల్లో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు రెగ్యులర్ చేయమని నిరసనలు చేపడితే విచ్చిన్నం చేయడం హాస్యాస్పదం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు నత్త నడకను మరిపిస్తున్నాయని అన్నారు.నోటిఫికే‌న్ లు వెలువరించడమే తప్పు కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని కోరారు. అంగన్వాడీ ల సమస్యలు పరిష్కరించడానికి పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని,మీ న్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యాచరణ చేపడతామని బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బి.చిరంజీవి,పేరాయిగూడెం సర్పంచ్ నార్లపాటి సుమతి,తెదేపా అసెంబ్లీ అభ్యర్ధి కట్రం స్వామి, నాయకులు శ్రీను, సీపీఐ నాయకులు సలీం, రామక్రిష్ణ, రఫీలు పాల్గొని మద్దతు ప్రకటించారు.