బైపాస్ రోడ్డు నిర్మాణం వద్దు

నవతెలంగాణ – మోర్తాడ్

జాతీయ రహదారి నిర్మాణంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం సరికాదంటూ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల లోనే వరద కాలువ నిర్మాణంలో, రైల్వే లైన్ నిర్మాణంలో తమ వ్యవసాయ భూములు కోల్పోవడం జరిగిందని ప్రస్తుతం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల ఉన్న కాస్త భూమి కోల్పోయి తమ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ప్రస్తుత రోడ్డునే హైవే రోడ్డుగా ఏర్పాటు చేయాలంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. మార్చ్ 14 2023లోనే ప్రస్తుత రోడ్డును ఫోర్వే లైన్ గా ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ జాతీయ రహదారుల అధికారులు హద్దులను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని కాదంటూ ప్రస్తుతం నూతన రోడ్డు ఏర్పాటు చేయాలంటూ తక్షణ జీవోలు తెచ్చి తమ పంట భూములను కోల్పోయే విధంగా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడం సరికాదంటూ కుటుంబ సమేతంగా రైతులు రహదారిపై నిరసన తెలిపారు. ప్రస్తుత రోడ్డులో కేవలం 6 నిర్మాణ ఇండ్లు మాత్రమే నష్టపోతున్నప్పటికీ వ్యవసాయ భూములు ఏమీ లేవని బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే 40 కుటుంబాల రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని బైపాస్ రోడ్డు కాకుండా ప్రస్తుత రోడ్డునే వెడల్పు చేస్తూ రహదారి నిర్మాణం పనులు చేపట్టాలని కోరారు. బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే తాము పూర్తి ఆస్తులను కోల్పోయి రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనీ రైతే రాజు అంటున్న ప్రభుత్వాలు రైతులు రోడ్డున పడకుండా చూడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. తక్షణమే బైపాస్ రోడ్డు నిర్మాణం కాకుండా ప్రస్తుత రోడ్డునే వెడల్పు చేసి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు నాటి జీవో కాపీలను తోబాటు సరిహద్దు నివేదికలను అధికారికి చూపించారు. రైతు ల వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామంటే హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాలు వివరించారు.