– ఏ ఒక్కరు కూడా హాజరవ్వని సభ్యులు..
– యధావిధిగా ఎంపిపి, వైస్ ఎంపిపి కొనసాగుతారని అధికారుల వెల్లడి..
నవతెలంగాణ- వెల్గటూర్: వెల్గటూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కూనమళ్ళ లక్ష్మి, ఉపాధ్యక్షురాలు ముస్కు కవితపై పెట్టిన అవిశ్వాసం విగినట్లుగా ఎన్నికల అధికారి (రెవెన్యూ డివిజన్ అధికారి జగిత్యాల) నరసింహ మూర్తి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. గత నెల డిసెంబర్ 11వ తేది న 10 మంది సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాసం నోటీసును జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారికి అందజేశారు. నోటీసుకు స్పందించిన అధికారులు జనవరి 09న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా సభ్యులు అందరికీ నోటీసులు అందజేశారు. మండల ప్రజా పరిషత్ కార్యలయంలో ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రత్యేక సమావేశంకు ఏర్పాటు చేసారు 12:30 గంటల వరకు ఏ ఒక్క సభ్యుడు హాజరుకాక పోవడంతో ఎన్నికల అధికారి జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహ మూర్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాసనికి ఎ ఒక్క సభ్యుడు హాజరు కాకపోవటంతో అవిశ్వాసం విగిపోయినట్లు తెలియజేశారు.కాగా యధావిధిగా ఎంపిపి కూనమళ్ళ లక్ష్మి, వైస్ ఎంపిపి ముస్కు కవిత లు యధావిధిగా కొనసాగుతారని అధికారులు తెలిపారు.ఈ యొక్క ప్రత్యేక సమావేశం కు వెల్గటూర్ ఎస్సై శ్వేత పర్యవేక్షణలో ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంజీవరావు, వెల్గటూర్ ఎండపల్లి ఎమ్మార్వోలు శేఖర్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు