నేడు సింగల్‌ విండో చైర్మన్‌పై అవిశ్వాసం

no-confidence-in-single-window-chairman-todayనవతెలంగాణా- ముత్తారం
ముత్తారం సింగల్‌ విండో చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డిపై నేడు అవిశ్వాసం పెట్టనున్నారు. ఫిబ్రవరి 8న జిల్లా సహకార సంఘం సబ్‌ రిజిస్టర్‌ రాంమోహన్‌కు మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 9 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాణాన్ని అందజేశారు. దీంతో అవిశ్వాసంపై నేడు మండల కేంద్రంలోని సింగల్‌ విండో కార్యాలయంలో బల పరీక్ష జరగనుంది. ఈ అవిశ్వాస తీర్మాణంకు అనుకూలంగా 10 మంది డైరెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది.