పిఏసిఎస్ చైర్మన్‌పై అవిశ్వాస సమావేశం వాయిదా

పిఏసిఎస్ చైర్మన్‌పై అవిశ్వాస సమావేశం వాయిదానవ తెలంగాణ,మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చెప్యాల రామారావు పై డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి భూపాలపల్లి జిల్లా డిసిఓ శైలజ మంగళవారం నిర్వహించాల్సిన అవిశ్వాస తీర్మాన సమావేశం అడ్మినిస్ట్రేషన్ కారణమంటూ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన డైరెక్టర్లు ఎవరు హాజరు కాలేదు కాగా చైర్మన్ వైపు నుంచి కూడా డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో బుధవారానికి ఆమె వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. 2020 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో 13 మంది డైరెక్టర్లకు ఐదుగురు కాంగ్రెస్, ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా 8 మంది డైరెక్టర్ల మద్దతుతో మల్లారం గ్రామానికి చెందిన చెప్యాల రామారావు చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు.నేడు అయిన సమావేశం జరిగేనా అని పిఏసిఎస్ లోని సభ్యత్వం ఉన్న రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు