– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి
నవతెలంగాణ-జైపూర్
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు గడిచినా ఏక కాలంలో రూ.2లక్షల రుణ మాఫీ చేయలేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. శుక్రవారం కోటపల్లి మండలం రొయ్యలపల్లిలో కావిరి రాజబాబు అధ్యక్షతన నిర్వహించిన సీపీఐ(ఎం) శాఖ మహా సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హాయాంలో దేశంలో మహిళలపై హత్యాచారాలు, హత్యలు పెరిగి పోతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. తెలంగాణాలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన తీరును గుర్తు చేశారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వంలో హక్కు పత్రాలు ఉన్న వారికి సైతం బ్యాంకు రుణాలు ఇవ్వలేదని అన్నారు. ఆధార్ కార్డుతో సంబందం లేకుండా గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏర్మా పున్నం, జిల్లా కమిటి సభ్యులు బోడంకి చందు, కావిరి రవి, సిడం సమ్మక్క, నాయకులు శ్రావన్, సంపత్, శ్రీకాంత్, మల్లేష్, ఆనంద్, వెంకటి, రాజన్న పాల్గొన్నారు.