– బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర..
నవతెలంగాణ – బంజారా హిల్స్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్దరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేదనీ డిజే సౌండ్ అండ్ నైట్ లెట్ కార్యకలాపాలు మానుకొని శాంతిభద్రతలకు విగాథం కలిగించకుండా శాంతియుత వాతావరణం లో వేడుకలు జరుపుకోవాలని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకూ ముఖ్యంగా యువతకి సూచించారు. మద్యం సేవించి /ట్రిపుల్ రైడింగ్ చేసి వాహనలతో రేసింగ్ లు చేస్తూ,గుoపులు గుంపులుగా చేరి నడిరోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదనీ డిసెంబర్ 31వ తేది రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనములపై తిరుగుతే చట్టపరమైన శిక్షలు చర్యలు హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేది రాత్రివేళ పొలిస్ స్టేషన్ పరిధిలో గస్తీ ముమ్మరంగా వుంటుందనీ బంజారాహిల్స్ ఏసిపి వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రాఘవేంద్రాలు తెలిపారు.
యువతకు ప్రత్యేక సూచీక…
మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ మద్యం సేవించి వాహనములు నడిపిన వారిపై 15,000 రూపాయలు జరిమానా & వాహనము సీజ్,ద్విచక్ర వాహనాలకు సైలన్సర్ తీసి వేసి అధిక శబ్దాలతో హోరేత్తిoచడం,అతి వేగంతో రోడ్లపై తిరగటం,వాహనములు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాణాసంచా పేల్చడం వంటి వాటివలన ప్రశాంతతకు భంగం కలిగి వృద్దులకు, చిన్న పిల్లలకు , రోగులకు ఇబ్బంది కలుగుతుందనీ ఎవరికి ఇబ్బంది తెలియకుండా శాంతియుత వాతావరణం లో శాంతి భద్రతలకు విగతం కలగకుండా వేడుకలు జరుపుకోవాలని సూచిస్తూ, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైనా కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. ఎవరికైనా ఏదైనా అత్యవసరం అయితే వెంటనే 100 కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.ముఖ్యంగా యువత డ్రగ్స్ వినియోగం కు పూర్తిగా దూరంగా ఉండి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగం చేస్తున్నట్లు సమాచారం వుంటే తమకు సమచారం అందించాలనీ ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలను ఎలా నిర్వహించుకోవాలని అని యువతకు సూచనలివ్వడం జరిగిందన్నారు.ఇతరులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవడానికి పోలీసులకు సహకరించి ఘనంగా నూతన సంవత్సరాన్ని శుభంగా స్వాగతించాలి కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. రిజిస్ట్రేషన్ పరిధిలోని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర వేడుకలు తెలియజేస్తూ సూచనలను అధిగమించిన వారిపై చట్టపరమైన చర్యలు మాత్రం తప్పవని ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదని చెప్పారు.