స్టేట్‌మెంట్‌ మినహా సాక్ష్యాధారాలేవీ..?

Supreme Court– మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్య మంత్రి మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్య లు చేసింది. ఈ కేసులో అప్రూ వర్‌గా మారిన నిందితుడు దినేష్‌ అరోరా స్టేట్‌మెంట్‌ మినహా సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఎక్కడ ఉన్నా యని ప్రశ్నించింది. నగదు ఎవరి నుంచి ఎవరికి ఎలా చేరిందనే అంశం పై పూర్తి సాక్ష్యాధారాల లింకులను సమర్పించలేదని పేర్కొంది. లిక్కర్‌ గ్రూపుల నుండి మనీస్‌ సిసోడియాకు ముడుపులు అందాయని దర్యాప్తు సంస్థ పేర్కొందని, అయితే ఆ నగదు ఎలా చేరిందని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. ”మీరు రూ.100 కోట్లు, రూ.30 కోట్లు అని రెండు అంకెలు చెప్పారు. వారికి ఇది ఎవరు చెల్లించారు. నగదు చాలా మంది చెల్లించవచ్చు. మద్యానికి సంబంధించినదే కానవసరంలేదు. సాక్ష్యం ఎక్కడ ఉంది. దినేష్‌ అరోరా కూడా నగదు తీసుకున్న వ్యక్తే. గ్రహీత. ఒక్క దినేష్‌ అరోరా ప్రకటన తప్ప.. ఈ కేసులో సరైన రుజువులు ఏవి” అని జస్టీస్‌ ఖన్నా ప్రశ్నించారు. ఈ కేసులో విజరు నాయర్‌ మాత్రమే ఉన్నారని, మనీష్‌ సిసో డియా పాత్ర లేదని ధర్మాసనం ప్రశ్నిం చింది. మనీలాండరింగ్‌ చట్టం కింద సిసోడియాను ఎందుకు అరెస్ట్‌ చేశా రని ప్రశ్నించింది. అప్రూవర్‌గా మారిన ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యం గా పరిగణించలేమని వ్యాఖ్యానించిం ది. ఈ కేసులో సిసోదియాకు వ్యతి రేకంగా సరైనా ఆధారాలను చూపించ లేకపోయారని కోర్టు స్పష్టం చేసింది.
అయితే ఈ కేసులో నిందితుడిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పేరును చేర్చేందుకు ఈడీ కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని పై న్యాయసలహాలు కూడా తీసుకుం టున్నాయని సమాచారం. న్యాయవా దుల నుండి అభిప్రాయాలను సేకరిం చిన తర్వాత ఈడి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుందని ఆ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో మనీష్‌ సిసోడియా కేసులో పూర్తి సాక్ష్యాధా రాలు సమర్పించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనార్హం.