బడికి నిధులేవీ..?

No funds for school..?– పాఠశాలల స్టేషనరీకి నిధుల కొరత

– నిర్వహణ గ్రాంట్ ఆలస్యమైన వైనం
– సొంత డబ్బులు వెచ్చించి సౌకర్యాలు… సమకూర్చుకుంటున్న టీచర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
సాధారణంగా ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం ఏడాదికి రెండు పర్యాయాలు స్కూల్ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేస్తుంది. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు స్టేషనరీ కొనుగోలుతో పాటు పాఠశాలల నిర్వహణకు నిర్దేశించిన మెయింటే నెన్స్, స్కూల్ గ్రాంట్ నిధులు విడుదల కాలేదు. ఫలితంగా రిజిస్టర్లు, డస్టర్లు, చాక్పిస్ ల కొను గోలుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధయాయులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మరికొన్ని పాఠశాలల్లో టీచర్లే సొంత డబ్బులు వెచ్చించి కొంతమేర సౌకర్యాలు సమకూర్చుకుంటున్న సందర్భాలు అక్కడక్కడ ఉన్నాయి. గతంలో విద్యార్థుల సంఖ్య లెక్క ప్రకారం మెయిటేనెన్స్, స్కూల్ గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేసేది. ఈ విద్యా సంవత్సరం బడులు తెరిచి మూడు నెలలు గడుస్తున్నా నిధులను విడుదల చేసే విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మండల వ్యాప్తంగా 5 జిల్లా పరిషత్,27 ప్రాథమిక, రెండు ప్రాతమికొన్నత,ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి.వీటిలో సుమారు 1836 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం ఏటా రెండు విడతలుగా అందించే గ్రాంట్తో పాఠ శాలల్లో చాక్పోసులు మొదలుకుని హాజరు రిజిష్టర్లు, ఇతర అవసరమైన సామగ్రి ప్రయోగశాల రసాయనాలను పాఠశాల నిధుల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు: మల్కా భాస్కర్ రావు…తాడిచెర్ల హైస్కూల్ ప్రాధానోపాధ్యాయుడు 
గత ఏడాది చివరి వరకు పాఠశాలల నిర్వహణ నిధులు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి ఇంకా ప్రభుత్వం నుంచి గ్రాంటు విడుదల కాలేదు. ప్రస్తుతం సౌకర్యాలను తామే సమకూర్చుకుంటూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి.
రెండు విడతల్లో మంజూరు కావాల్సిన నిధులు ఇలా..
విద్యార్థుల సంఖ్య రావాల్సిన మొత్తం 1నుంచి 30 మంది విద్యార్థులకు రూ. 10,000. 31 నుంచి 100 విద్యార్థులకు రూ.25,000. 101 నుంచి 250 విద్యార్థులకు రూ.50,000. 251 నుంచి 1000పైన విద్యార్థులకు రూ.75,000. నిధులు విడుదల చేయని కారణంగా బడుల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడు తున్నాయని ఉపాధ్యా యులు పేర్కొంటున్నారు.