నిధులు లేక పారిశుధ్యం పడక

నిధులు లేక పారిశుధ్యం పడక– గ్రామాల్లో అంతర్గత రహదారులు బురదమయం
నవతెలంగాణ-కల్లూరు
కల్లూరు మండలంలో గత వారం రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలలోని రహదారులు బురదమయంగా మారి దుర్వాసనలో వెదజల్లుతున్నాయి. మండల పరిధిలోని 31 గ్రామపంచాయతీలలో ఇదే తంతు స్పెషల్‌ అధికారుల పరిపాలన నామమాత్రంగా మారడంతో గ్రామీణ ప్రాంతాలలో గ్రామపంచాయతీలలో సైతం నిధులు లేవంటూ పంచాయతీ సెక్రటరీలు చేతులెత్తడంతో ఫాగింగ్‌ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. పంచాయతీ సెక్రెటరీ కానీ రానున్న ఈ వర్షాకాలంలో ఆరోగ్యల రీత్యా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్‌ వంటి వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు, వ్యాధులను సోకకుండా నివారించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండల పరిధిలోని 31 గ్రామ పంచాయతీలలో స్పెషల్‌ అధికారులు చొరవచూపి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించే విధంగా చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విధులు విడుదల చేసి బ్లీచింగ్‌ ఫాగింగ్‌, పారిశుద్ధ్యం, డ్రైనేజీలలో కూరుకుపోయిన మట్టిని తొలగించి మురుగునీరు బయటకు పోయే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.