గుజరాత్ మోడల్ వద్దు – తెలంగాణ మోడల్ ముద్దు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
గుజరాత్ మోడల్ వద్దు – తెలంగాణ మోడల్ ముద్దని, భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అని వ్యవసాయం దండగ కాదు పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన ఉంటూ వారిని ఆదుకుంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ రైతుల కోసం అహర్నిశలు శ్రమపడి రోల్ మోడల్గా తయారు చేశారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి, రాంపూర్ డి,బార్దిపుర్, ఖిల్లా డిచ్ పల్లి,యానంపల్లి,ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి,ఇందల్ వాయి,లోలం గ్రామాల్లోని రైతువేదికలో నిర్వహించిన తెలంగాణ రైతు దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు గ్రామ శివారులో రైతులు, నాయకులు ఘనస్వాగతం పలికి ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీగా బయలుదేరి రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. జాతీయ గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి సందేశాన్ని రైతులకు, ప్రజలకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 28 రైతు వేదికలను నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు రూరల్ నియోజకవర్గంలో 55 లక్షల 55వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే వారని నేడు కేసీఆర్ జలయజ్ఞం ద్వారా బీడుగా ఉన్న భూముల్లో రెండు పంటలు పండిస్తున్నారని, నేడు రెండు లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పెరిగిందన్నారు.
     రైతులు పండించిన పంటలకు కెసిఆర్ రైతులకు నమ్మకాన్ని కలిగిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తూ రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తున్నారన్నారు. ఇవే కాకుండా రైతుబీమా, రైతుబందు అమలు చేస్తూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. నేడు పంటలు సమృద్ధిగా పండటంతో కూలీలు దొరకక బిహార్ రాష్ట్రం నుండి కలుపు తీయడానికి కోతల సమయంలో వారు వచ్చి మన రాష్ట్రంలో పనులు చేస్తున్నారన్నారు. గుజరాత్ మోడల్ వద్దని తెలంగాణ మోడల్ కావాలని ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రానికి ఇచ్చేది చేతకాదని దేశంలో మోడీ పాలనను, రాష్ట్రంలో కేసీఆర్ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. రాష్ట్రమే కాకుండా దేశం బాగుండాలనే ఉద్దేశంతో దేశం మొత్తంలో కేసీఆర్పైనే చర్చ సాగుతుందన్నారు. గతంలో కరెంటు సమస్య రైతన్నలకు ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రజలకు, రైతులకు బాగా తెలుసని ఇప్పుడు 24 గంటల కరెంటు అందజేస్తుందన్నారు. ప్రజలు ఏ ప్రభుత్వం బాగా పనిచేస్తుందో గుర్తించుకొని మీ అందరి మద్దతు కేసీఆర్కు ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం నాయకులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ రైతులకు ఏ ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ ముందుండి వారిని ఆదుకుంటున్నారని రాబోయే రోజుల్లో మరింత సేవ చేసే భాగ్యం రైతులు, ప్రజలు కల్పించాలని, అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్మోహన్, ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్,ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, దాసరి ఇందిర లక్ష్మీనర్సయ్య, ఆర్డీవో రవి, తహసిల్దార్లు శ్రీనివాస్ రావు, టివి రోజా, ఎంపిడిఓ రాములు నాయక్, గోపి బాబు, ఏడీఏ ప్రదీప్ కుమార్, రైతుబందు మండల కోఆర్డినేటర్ నారాయణరెడ్డి,మోహన్ నాయక్,  బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, చిలువెరి దాస్, సర్పంచులు పాపాయి తిరుపతి, తేలు గణేష్, విజయలక్ష్మి లక్ష్మారెడ్డి, తేలు విజయకుమార్, మమతా శేఖర్, నరేష్, పాశం సత్తేవ్వ నర్సింలు, నర్సయ్య, బోడ సునీతా రఘు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి,లోలం సత్యనారాయణ,రఘునథన్ రాము  జగదీశ్ నాయక్, లింగం యాదవ్, మాజీ అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, సీనియర్ నాయకులు పాశం కుమర్, అరటి రఘు, రవివర్మ,ఫైజల్ పాషా, సదానంద్, వ్యవసాయ శాఖ అధికారులు రాంబాబు, ప్రవిన్ కుమార్,ఉప సర్పంచ్ ఎంకన్నోల్ల రమేష్, చైర్మన్ గోవర్దన్ రెడ్డి,విడిసి అధ్యక్షులు రాజ్ కుమార్ తోపాటు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు విడీసీ సభ్యులు తదితరులు ఉన్నారు. మెంట్రాజ్పిల్లి గ్రామంలో 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతువేదికను మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీగౌడ్, జెడ్పీటీసీలు. బాజిరెడ్డి జగన్మోహన్, దాసరి ఇందిర లక్ష్మినర్సయ్య, నాయకులతో కలిసి ప్రారంభించారు.