నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పేద రైతుల భూములలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయవద్దని అక్కన పేట మండలంలోని చౌటపల్లి గ్రామ రైతులు మంగళవారం హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. 312 సర్వే నంబర్ లో వందమంది పేద దళిత రైతులం భూమిని దున్నుకుంటున్నామన్నారు.వ్యవసాయ చేసుకునే భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు తీసుకోవద్దని కోరారు. జీవనాధారమైన భూములు ఆక్రమించడం వల్ల అనాధలం అవుతామని, తమ పిల్లల భవిష్యత్తు అంధకార మవుతుందని పేర్కొన్నారు. చౌటపల్లి లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలనే ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో గ్రామ రైతులు ఇల్లందుల జంపయ్య, ఆవుల పెద్ద వెంకటయ్య, వెల్ది రంగారావు ఉన్నారు.