విచారణ లేదు..మద్దతుగా ఉన్నతాధికారులు?

– చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వస్తున్న అధికారులను కాపాడుతున్నది ఎవరు?                       
– నిత్యం మండల ప్రజా పరిషత్ కార్యాలయం పై  వివిధ ఆరోపణలు వస్తున్న  జిల్లా అధికారులు స్పందించపోవడానికి గల కారణం ఏమిటో… 
– దశాబ్ద ఉత్సవాలలో   భాగంగా లక్ష జలహారతి కార్యక్రమం లో  కోడిగుడ్ల మాయం పై విచారణ చేయాలని పలువురు డిమాండ్
నవతెలంగాణ – చివ్వేంల
ఫిబ్రవరి 3తారీఖున (నవతెలంగాణ వెబ్)లో చేతివాటం ప్రదర్శించిన ఆ అధికారి ఎవరు?కధనం ప్రచురించడం జరిగింది. కథనం ప్రచురించి వారం గడుస్తున్న జిల్లా అధికారులు స్పందించకపోకపోగా ఆ ఉన్నతాధికారులే ఆ అక్రమ అధికారులకు  మద్దతు తెలుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే  హడావిడి చేసే అధికారులు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన దశాబ్ద ఉత్సవాలలో భాగంగా  లక్ష జల హారతి కార్యక్రమంలో  భారీ అవినీతి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.    స్టోర్ రూమ్ లో దాసిన గుడ్లు మాయం కావడం పై విచారణ చేయకుండా అధికారులు  మీనమేషాలు లెక్కబెడుతున్నారు.. మండలంలోని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నప్పటికీ  ఇందులో దొరికిన వారే దొంగలు.. దొరకని వారు చాలా దర్జాగా దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.  జిల్లా అధికారులు మండలంలో ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు వస్తున్న  విచారణ చేయడానికి కనీసం కమిటీ వేయకపోవడం పట్ల  పలువురు ప్రజా సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లా అధికారులు అవినీతి ఆరోపణలు వస్తున్న అధికారులకు అండగా నిలబడతారో లేక విచారణ చేపట్టి  దోచుకున్న ప్రభుత్వ సొమ్మును కక్కిస్తారో వేచి చూడాలి.
అయినా ఆ అధికారి తీరే సపరేటు: ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఈ చేతివాటం ప్రదర్శించే అధికారి తీరే సపరేటు..ఇక్కడికి బదిలీ  అయివచ్చిన దగ్గర   నుండి కార్యాలయాన్ని రాజకీయాలకు నిలయంగా మార్చాడనే ఆరోపణలు వస్తున్నాయి.. మండల స్థాయి అధికారుల మధ్య పంచాయతీలు పెట్టి తాను మాత్రం ఆనంద పడుతుంటాడని సమాచారం. అప్పటి బీఆర్ఎస్ నాయకులతో ఉన్న పరిచయం అడ్డం పెట్టుకొని ఇక్కడ స్థానిక నాయకులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని అధికారిగా కాకుండా రాజకీయ నాయకుడిలా  వ్యవహరిస్తుంటడని, కార్యాలయం కు  వచ్చిన వారిని   ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం వారితో ఏదోరకమైన ప్రయోజనం పొందడం ఇతని అలవాటని గుసగుసలు ఆడుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న అధికారులే ఎక్కువగా ఉండడంతో అతన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు అన్ని అవసరాలకు వాడుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇతని మాటలు వినలేదని ఓ అధికారి మీద అసత్య ఆరోపణ చేస్తే కొందరు రాజకీయ నాయకులతో ఆ శాఖ జిల్లా స్థాయి అధికారులు బెదిరింపులకు గురి చేసి నాయకులకు కొంత నగదు కూడా ఇప్పించినట్లు విమర్శలున్నాయి.