అధికారులు ఎన్ని ఆటంకాలు సృష్టించిన్న సమ్మె ఆగదు

– ఉద్యోగులపై వేధింపులు ఆపాలి.
– లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదతం చేస్తాం.
– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహేందర్‌ రెడ్డి
నవ తెలంగాణ-నర్సాపూర్‌
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం, ఐసీడీస్‌ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ సమ్మె విచ్చినం చేసే కుట్ర చేస్తున్నారని సీఐటీయూ మెదక్‌ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మహేందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు కడారి నాగరాజులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నర్సాపూర్‌లో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు అనేక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో గ్రామాలలో ప్రధాన భూమికగా పనిచేస్తున్నారన్నారు. వారి కష్టాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. రాష్ట్రంలో జేఏసీగా ఏర్పడి నేటి నుంచి సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మెను విచ్చినం చేయడం కోసం సెంటర్ల తాళాలు అధికారులు పగలకొట్టి నడపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏదిఏమైనా సమ్మె ఆపేది లేదన్నారు . ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాకు రూ.5లక్షలు ఇవ్వాలని కోరారు. వేతనంలో సగం పెన్షన్‌, ప్రమాద బీమా సౌకర్యం వాటితో పాటు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెలిస్తూ సమ్మె నోటీస్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, విజయ, వరలక్ష్మి, ఫారీదా, సువర్ణ, ధనలక్ష్మి, విజయ, మంజుల, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నిజాంపేట
మండల కేంద్రంలోని ఏపిఎంకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని అంగన్వాడి టీచర్లు ఎల్పారుల తరఫున సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జాయింట్‌ ఆక్షన్‌ కమిటీ సెప్టెంబర్‌ 11 నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేయడం కొనసాగుతుందని మెదక్‌ జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షురాలు బాలమని అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్‌ సమ్మెలో కొనసాగుతున్నందున వివోలు, కార్యదర్శుల చేత అంగన్వాడి సెంటర్లో వంటలు చేపిస్తామనడం సమంజసం కాదన్నారు. దాదాపు 48 సంవత్సరాల నుంచి అంగన్వాడి టీచర్లు ఆయాలు పనిచేస్తున్నారని అంగన్వాడి వ్యవస్థను కాపాడుకుంటూ వస్తున్నామని, ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోవడం సమంజసం కాదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరించిందని, ఆ ప్రభుత్వాన్ని అంగన్వాడీ టీచర్లు ఏకమై ప్రభుత్వాన్ని కూల తోయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. లేనియెడల కేసీఆర్‌ ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో యశోద, రేణుక, నాగలక్ష్మి, లలిత శోభ ,దుర్గేశ్వరి తదితరులు పాల్గొన్నారు.