తలపై దురద, చుండ్రు అనే రెండు సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధించేవే. చుండ్రుకు ప్రధాన కారణం జుట్టులో ఉండే మురికి. ఇది కాకుండా, జుట్టు రంగు, ఒత్తిడి, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆందోళన లేదా పేలు కూడా చుండ్రుకు కారణం కావచ్చు. అదే సమయంలో, తల దురద వ్యాధిని సెబోరోహెయిక్ డెర్మటైటిస్ అని పిలుస్తారు, ఇది అధిక చుండ్రు వల్ల వస్తుంది.
వింటర్ సీజన్‌లో స్కాల్ప్‌లో డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించుకోవాలంటే తలకు నూనె రాయండి లేదా తలపై బాగా మసాజ్ చేయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా దురద వస్తుంది. మీరు తల దురద సమస్యతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను వదిలించుకోవచ్చు.
నిమ్మరసం
నిమ్మరసంలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీన్ని కాటన్ బాల్‌తో తలకు పట్టించి 10-15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే తల దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.
కొబ్బరి నూనె
కొన్నిసార్లు దురదకు చర్మం పొడిగా ఉండటం కూడా ఒక కారణం. కొబ్బరి నూనె తలకు అద్భుతమైన మాయిశ్చరైజర్. దీన్ని వేడి చేసి తలపై మసాజ్ చేయాలి. వీలైనంత సేపు అలాగే ఉంచి తర్వాత షాంపూతో కడగాలి. అలాగే కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరం మిక్స్ చేసి తలకు మర్దన చేయాలి. కర్పూర ప్రభావంవల్ల చల్లగా ఉంటుంది, దీని వల్ల దురదలు తగ్గి, ఎలాంటి ఇన్ఫెక్షన్ వున్నా నయమవుతుంది.
వంట సోడా
2-3 చెంచాల బేకింగ్ సోడా తీసుకుని నీటితో పేస్ట్ చేయాలి. దీన్ని తలకు పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్, ఇది స్కాల్ప్‌ను శుభ్రం చేస్తుంది. దురద తగ్గిస్తుంది.
ఉల్లిపాయ రసం
ఒక ఉల్లిపాయను తీసుకుని దాని రసాన్ని తీయండి. దీన్ని కాటన్‌తో తలకు పట్టించి కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది, చికాకును తగ్గిస్తుంది.
పెరుగు
పెరుగుతో తలకు మసాజ్ చేయడం వల్ల కూడా కూడా తగ్గుతుంది. దీంతో జుట్టుకు మెరుపు వస్తుంది. మురికి దురదకు కారణమవుతుంది కాబట్టి స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం.