ధర ఉన్నా… మిగిలేది సున్నా..

– రైతులకు ఎప్పుడూ గడ్డు కాలమే..
– ముసురుకున్న తెగుళ్ళు..
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులకు ఎప్పుడూ గడ్డుకాలమే. అటు అకాల వర్షాలు ఇటు వర్షాభావంతో కర్షకులు కలవరపడుతుండగా దళారుల దోపిడితో చిక్కిశల్యమవుతున్నారు. అరకొర పంట దిగుబడులకైనా గిట్టుబాటు ధర లభిస్తోందని ఆశిస్తే దళారులు గద్దల్లా తన్నుకపోతున్నారు.ప్రభుత్వం నిర్వహించిన పంట కొత ప్రయోగల్లోనూ దిగుబడి తగ్గినట్లుగా తేటతెల్లమైంది.దీంతో రైతులు ఆందోళనకు గురివుతున్నారు.
సంవృద్ధిగా జలాలు ఉన్న..
ఒక్కప్పుడు వర్షాలు లేక పంటలు దెబ్బతినగా దిగుబడి అంతంతా మాత్రమే వచ్చేది. రెండేళ్ల నుంచి వర్షాలు సంవృద్ధిగా కురుస్తుండగా సకాలంలో కురువాలసింది.ఆసకాలంలో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు డ్రై స్పెల్ (వర్ష విరామం) తీరని నష్టాన్ని మిగిల్సిoది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు కురుస్తుండగా పంటలు జలసమాధైన ఘటనలు లేకపోలేదు.పత్తి పంటకు సంబంధించి పూత రాలి ఖాత నల్లగా మారి పత్తి రూపు కోల్పోయింది. మండలంలోని తాడిచెర్ల, మల్లారం, వళ్లెంకుంట, కొండంపేట, కుంభంపల్లి, పివి నగర్ తదితర మానేరు పరివాహక ప్రాంతల్లో అతి వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి.
ఆశలు ఆడియాశలే…
మండలంలో 15,046 ఎకరాల్లో వరి, 3,657 వేల ఎకరాలకు పైగా పత్తి సాగు చేశారు.ఆరంభంలో పంటలు కలకలాడటంతో రైతులు దిగుబడులపై ఆశలు పెంచుకున్నారు. కానీ సకాలంలో కురిసిన వర్షాలు ఆశలను ఆడియాశలే చేశాయి. సకాలంలో వర్షాలు లేక దిగుబడిపై ప్రభావం పడింది.వరి గొలుసు వేసిన దశలో వర్షాలు కురవడంతో పూత రాలిపోయింది. దీనికి తోడు తెగుళ్లు ముప్పిరిగొన్నాయి. అలాగే పత్తి పంట ఎదుగుదల దెబ్బతినగా ఇతర చీడ, పిడల ఉధృతిలో పెట్టుబడి మరింత పెరిగింది.150 కి పైగా పంట కొత ప్రయోగాలు చేపట్టగా దిగుబడులు తక్కువగా రావడం రైతుల దుస్థితి అద్దం పడుతోంది. పత్తి 5 నుంచి 6 కిలోలు రాగ, వరి ధాన్యం 14 నుంచి 15 కిలోలు రావడం జరిగింది.
నష్టపరిహారం అందేనా.?
ప్రకృతి వైపరీత్యాలతో పంట కోల్పోయిన రైతాంగానికి భరోసా కరువైపోయింది. గత రెండు సీజన్లు కలిపి అకాల వర్షాలకు మానేరు పరివాహక ప్రాంతాల్లో 5,789 వేల ఎకరాల్లో ఇసుక మెటలు పెట్టి పంటలు దెబ్బతిన్నాయి.500 కరెంట్ స్తంభాలు కొట్టుకుపోయాయి.150 ట్రాన్స్ పార్మర్లు దెబ్బతిన్నాయి. 2వేల కరంట్ మోటార్లు కొట్టుకుపోయాయి. నామమాత్రంగా పంట నష్టానికి ప్రాథమిక అంచనా నివేదికలు తయారు చేసి అధికారులు, గత ప్రభుత్వం చేతులు దులుపుకున్నాయి.గతంలో బ్యాంకు రుణాలు పొందిన రైతులకు పరిహారం వచ్చేది. అలాగే పంటల బీమా ప్రీమియం చెల్లించినవారికి పరిహారం అందేది.ఈ సారి ఆ ఊసేలేదు.
దళారుల రాజ్యం..పర్యవేక్షణ పూజ్యం…
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు అరకొర జరుగుతుండగా రైతులు దళారులను, రైస్ మిల్లర్లను ఆశ్రయించడంతో దళారులే ధరలను శాసించే పరిస్థితి నెలకొంది.తూకంలో తరుగు, నాణ్యత పేరుతో కిలోల కొద్దీ కొత విధిస్తున్నారు. సిండికెట్ గా మారి వీలైనంత దోచుకుంటున్నారు.
కొత ప్రయోగం ఇలా…
ప్రయోగానికి విస్తీర్ణం….. పావుగంట
వచ్చిన ధాన్యం దిగుబడి….14-15కిలోలు
రావాల్సిన దిగుబడి….20కిలోలు
పత్తి వచ్చిన దిగుబడి…5-6 కిలోలు
రావాల్సిన దిగుబడి….10-12 కిలోలు.
నిండా మునిగిన….
మూడెకరల్లో వరి వేసిన మొదట పంట మంచిగుండే మద్యలో వర్షాలు పడి తెగుళ్లు సోకాయి.వానలు అనుకూలంగా పడలేదు.వరి కొస్తే 25 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఎప్పుడైనా 80 క్వింటాళ్లు వచ్చేవి. అటు వాన పగ పట్టింది.