ఏ పనిలో ఉన్నా ప్రజా శ్రేయస్సే మిన్న: ఎమ్మెల్యేజారే

– సీఎం ఆర్ ఎఫ్ దరఖాస్తులను సెక్రటేరియట్ లో స్వయంగా అందజేసిన జారే
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏ పని లో ఉన్నా,ఎక్కడకు వెళ్ళినా ప్రజా శ్రేయస్సు కోరే ప్రధమ ప్రాధాన్యత గా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పనితనం కొనసాగుతుంది. అశ్వారావుపేట లో ఉన్న,హైద్రాబాద్ లో ఉన్నా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన నియోజకవర్గం ప్రజలు అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సోమవారం హైద్రాబాద్ వెళ్ళిన ఆయన నియోజక వర్గంలోని అయిదు మండలాల నుండి తన వద్దకు వచ్చిన 85 సీఎం ఆర్ ఎఫ్ దరఖాస్తులను,వాటికి సంబంధించిన మందుల బిల్లులను తానే స్వయం సెక్రటేరియట్ కు వెళ్ళి సంబంధిత విభాగం అధికారికి ప్రత్యక్షంగా అందించారు.