ఇక మేఘాలయతో పోరు

– భారీ విజయంపై హైదరాబాద్‌ గురి
షిల్లాంగ్‌ (మేఘాలయ): రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌కు పడిపోయిన హైదరాబాద్‌.. ఎలైట్‌ డివిజన్‌లో అడుగుపెట్టేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంది. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో నాగాలాండ్‌ను చిత్తు చేసిన హైదరాబాద్‌ నేడు మేఘాలయను ఢకొీట్టనుంది. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో బలమైన హైదరాబాద్‌కు మేఘాలయ ఏ మేరకు పోటీ ఇవ్వగలదో చూడాలి. హైదరాబాద్‌ బ్యాటర్‌ రాహుల్‌ సింగ్‌ డబుల్‌ సెంచరీతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. కెప్టెన్‌ తిలక్‌ వర్మ జాతీయ జట్టు బాధ్యతల్లో ఉండగా.. రాహుల్‌ సింగ్‌ సారథ్యం అందుకోనున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో తన్మరు అగర్వాల్‌ సైతం ఫామ్‌లో ఉండటంతో హైదరాబాద్‌ మరో భారీ విజయంపై కన్నేసింది. మేఘాలయపై సైతం బోనస్‌ పాయింట్‌తో నెగ్గాలనే పట్టుదలతో హైదరాబాద్‌ కనిపిస్తోంది. హైదరాబాద్‌, మేఘాలయ రంజీ పోరు ఉదయం 8.30 గంటలకు ఆరంభం.