గ్రీన్‌వాషింగ్ ఇక ఉండదు

– అడ్వర్టైజింగ్‌లో పర్యావరణ క్లెయిమ్‌ల కోసం ముసాయిదా మార్గదర్శకాలను ప్రతిపాదించిన ASCI
నవతెలంగాణ ముంబై: “పర్యావరణ / గ్రీన్ క్లెయిమ్‌లపై” సమగ్ర ముసాయిదా మార్గదర్శకాలను ఆవి ష్కరించడం ద్వారా పర్యావరణ ప్రకటనలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే దిశగా అడ్వర్టై జింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) కీలక అడుగులు వేసింది. ముసాయిదా మార్గదర్శకాలపై 2023 డిసెంబర్ 31 వరకు ప్రజాభిప్రాయం (ఫీడ్‌బ్యాక్) తెలియజేయవచ్చు, ఆ తరువాత అవి ఖరారు చేయ బడతాయి. పర్యావరణ నిపుణులతో సహా బహుళ- రంగాల సంబంధితుల టాస్క్‌ ఫోర్స్‌ చే అభివృద్ధి చేయబడిన ఈ మార్గదర్శకాలు వాణిజ్య ప్రకటనలు ‘గ్రీన్‌వాషింగ్’ పద్ధతులకు దూరంగా ఉండేలా చూసేందుకు ఉద్దే శించబడ్డాయి.
ముసాయిదా మార్గదర్శకాలు వాస్తవమైన, సాక్ష్యం-ఆధారిత పర్యావరణ క్లెయిమ్‌లను ప్రదర్శించడానికి ప్రకటనదారులకు స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ ను ఏర్పాటు చేశాయి. పర్యావరణ క్లెయిమ్‌లలో ఒక ఉత్పత్తి లేదా సేవ పర్యావరణంపై తటస్థ లేదా సానుకూల ప్రభావాన్ని చూపు తుందని లేదా సృష్టిస్తుందని సూచించే క్లెయిమ్‌లను కలిగి ఉంటుంది, అంటే అదే ఉత్పత్తి లేదా సేవ లేదా పోటీ ఉత్పత్తి యొక్క మునుపటి సంస్కరణ కంటే పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తుంది లేదా నిర్దిష్టంగా పర్యావరణ ప్రయోజనాలు కలిగిఉంటుంది.
పర్యావరణ / గ్రీన్ క్లెయిమ్‌లు స్పష్టంగా లేదా అవ్యక్తంగా ఉండవచ్చు. అవి ప్రకటనలు, మార్కెటింగ్ మెటీరి యల్, బ్రాండింగ్ (వ్యాపార సంస్థలు మరియు వ్యాపార పేర్లతో సహా), ప్యాకేజింగ్ లేదా వినియోగదారులకు అందించిన ఇతర సమాచారంలో కనిపించవచ్చు. ముసాయిదా మార్గదర్శకాలు గ్రీన్‌వాషింగ్‌- అంటే – తప్పుదారి పట్టించే పర్యావరణ క్లెయిమ్‌లను చేసే మోస పూరిత అభ్యాసం- ను లక్ష్యంగా చేసుకుంటాయి. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి నిరూపితమైన, పోల్చదగిన, ధ్రువీకరించదగిన క్లెయిమ్‌ల అత్యంత ప్రాముఖ్యతను ASCI నొక్కిచెప్పింది. ASCI తన ప్రక టన-నిఘాలో పర్యావరణ ప్రయోజనాలను కమ్యూనికేట్ చేయడానికి అనేక పదాలు వదులుగా ఉపయోగిం చబడుతున్నాయని కనుగొంది.
ఉత్పత్తి వాస్తవంగా ఉన్నదానికంటే ’గ్రీన్‘గా ఉందని అభిప్రాయాన్ని ఇస్తున్నట్లుగా గుర్తించింది. ప్రతిపాదిత మార్గదర్శకాలు:

1. “పర్యావరణ అనుకూలమైనది”, “పర్యావరణ స్నేహపూర్వకమైనది”, “సుస్థిరదాయకమైనది”, “గ్రహానికి అనుకూలమైనది”, వీటికి మాత్రమే పరిమితం కాకుండా, ఉత్పత్తి ఎటువంటి ప్రభావాన్ని కలిగి కలిగి ఉండదని లేదా సానుకూల ప్రభావం మాత్రమే ఉంటుందని పేర్కొనే క్లెయిమ్‌లు, ప్రచారం చేయబడిన అంశాలకు తప్పనిసరిగా ఉన్నత స్థాయి నిరూపణలతో మద్దతునివ్వాల్సి ఉంటుంది. “పచ్చదనం” లేదా “స్నేహపూర్వక” వంటి తులనాత్మక క్లెయిమ్స్ సమర్థించబడతాయి, ఉదాహరణకు, ప్రకటనదారు మునుపటి ఉత్పత్తి లేదా సేవ లేదా పోటీదారు ఉత్పత్తులు లేదా సేవల కంటే మొత్తం మీద పర్యావరణ ప్రయోజనాన్ని అందిస్తే అలా పేర్కొనవచ్చు మరియు అటువంటి పోలికకు ఆధారాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది.

2. పర్యావరణ క్లెయిమ్‌లు తప్పనిసరిగా ప్రకటన చేయబడిన ఉత్పత్తి లేదా సేవ యొక్క పూర్తి జీవిత చక్రంపై ఆధారపడి ఉండాలి, ప్రకటన వేరే విధంగా పేర్కొనకపోతే మరియు జీవిత చక్రం పరిమితులను స్పష్టం చేయాలి. సాధారణ క్లెయింను సమర్థించలేకపోతే, ఉత్పత్తి లేదా సేవ నిర్దిష్ట అంశాల గురించి మరింత పరిమి తమైన క్లెయిం సమర్థించబడవచ్చు. ప్రకటన చేయబడిన ఉత్పత్తి లేదా సేవ యొక్క జీవిత చక్రంలో కొంత భాగంపై మాత్రమే ఆధారపడిన క్లెయింలు ఉత్పత్తి లేదా సేవ మొత్తం పర్యావరణ ప్రభావం గురించి విని యోగదారులను తప్పుదారి పట్టించకూడదు.

3. సందర్భం నుండి స్పష్టంగా తెలియకపోతే, పర్యావరణ క్లెయిం అనేది ఉత్పత్తి, ఉత్పత్తి ప్యాకేజింగ్, సేవ లేదా ఉత్పత్తి, ప్యాకేజీ లేదా సేవలో కొంత భాగాన్ని దేన్ని సూచిస్తుందో పేర్కొనాలి.

4. సాధారణంగా పోటీ ఉత్పత్తులు లేదా సేవల్లో ఒక పదార్ధం కనుగొనబడకపోతే, పర్యావరణానికి హాని కలి గించే ఆ పదార్ధం లేకపోవడాన్ని హైలైట్ చేయడం ద్వారా ఓ ఉత్పత్తి లేదా సేవ అందించే పర్యావరణ ప్రయో జనం గురించి ప్రకటనలు విని యోగదారులను తప్పుదారి పట్టించకూడదు లేదా పోటీ ఉత్పత్తులు అదే ఆవ శ్యకతలకు లోబడి ఉన్న సందర్భాల్లో చట్టపరమైన బాధ్యత వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాన్ని చాటి చెప్పడం చేయకూడదు.

5. ధ్రువీకరణ పత్రాలు, ఆమోద ముద్రలు అనేవి ఉత్పత్తి లేదా సేవ ఏ లక్షణాలను ధ్రువీకరణదారు మూల్యాం కనం చేశారో మరియు అటువంటి ధ్రువీకరణ యొక్క ఆధారాన్ని స్పష్టం చేయాలి. ప్రకటనలో ఉపయోగించే ధ్రువపత్రాలు, ముద్రలు జాతీయంగా / అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ధ్రువీకరణ సంస్థ నుండి ఉండాలి.

6. ప్రకటనలోని విజువల్ ఎలిమెంట్స్ ప్రచారం చేయబడిన ఉత్పత్తి/సేవ గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలి గించకూడదు. ఉదాహరణకు, ప్యాకేజింగ్ మరియు / లేదా అడ్వర్టైజింగ్ మెటీరియల్‌లో రీసైక్లింగ్ ప్రక్రియను సూచించే లోగోలు ఉత్పత్తి లేదా సేవ పర్యావరణ ప్రభావం గురించి వినియోగదారు అభిప్రాయాన్ని గణనీ యంగా ప్రభావితం చేస్తాయి.

7.ఆ లక్ష్యాలు ఎలా సాధించబడతాయో వివరించే స్పష్టమైన, కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయని పక్షంలో ప్రకటనదారులు భవిష్యత్ పర్యావరణ లక్ష్యాల గురించి ఆకాంక్షాత్మకమైన క్లెయింలు చేయడం మా నుకోవాలి.

8. కార్బన్ ఆఫ్‌సెట్ క్లెయిమ్‌లకు సంబంధించి, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు జరగని ఉద్గార తగ్గింపులను కార్బన్ ఆఫ్‌సెట్ సూచిస్తుంటే ప్రకటనదారులు స్పష్టంగా, ప్రముఖంగా వెల్లడించాలి. చట్టం ప్రకారం తగ్గింపు లేదా తగ్గింపునకు కారణమైన కార్యాచరణ అవసరమైతే కార్బన్ ఆఫ్‌సెట్ ఉ ద్గార తగ్గింపును సూచిస్తుందని ప్రకటనలు నేరుగా లేదా సూచనతో క్లెయిమ్ చేయకూడదు.

9. ఉత్పత్తి కంపోస్టబుల్, బయోడిగ్రేడబుల్, రీసైకిల్, నాన్-టాక్సిక్, ఫ్రీ-ఆఫ్ మొదలైన వాటికి సంబంధించిన క్లెయిమ్‌ల కోసం, ప్రకటనదారులు అటువంటి క్లెయిమ్‌లు ఏయే అంశాలకు ఆపాదించబడుతున్నాయో మరి యు అదే మేరకు అర్హత కలిగి ఉండాలి. అటువంటి క్లెయిమ్‌లన్నింటికీ సమర్థమైన, నమ్మదగిన శాస్త్రీయ ఆ ధారాలు ఉండాలి: ఎ) వర్తించే ఉత్పత్తి లేదా అర్హత కలిగిన భాగం అది పారవేయబడిన తర్వాత సహేతుకమైన తక్కువ వ్యవధిలో విచ్ఛిన్నమవ్వాలి. బి) ఉత్పత్తి పర్యావరణ ప్రమాదాలకు దారితీసే మూలకాలు లేనిది అయిఉండాలి. ఈ సందర్భంగా ASCI సీఈఓ, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ మాట్లాడుతూ, ‘‘పర్యావరణ / గ్రీన్ క్లెయిమ్‌ లపై ASCI ముసాయిదా మార్గదర్శకాలు గ్రీన్ బ్రాండ్‌లకు మద్దతు ఇవ్వాలనుకునే వినియోగదారులకు స రైన సమాచారం ఉందని నిర్ధారించుకోవడానికి ఒక కీలకమైన దశ. ఈ మార్గదర్శకాలు ప్రకటనకర్తల కోసం ఒ క ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి. వినియోగదారుల ఉత్తమ ప్రయోజనాల కోసం ప్రకటనలలో పా రదర్శ కత, ప్రామాణికత సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. వినియోగదారులు, పరిశ్రమ, పౌర సమాజ సభ్యులు, నిపుణులతో సహా అన్ని వాటాదారులను, మేం వాటిని పదును పెట్టడానికి, బలోపేతం చేయడానికి వీలుగా ముసాయిదా మార్గదర్శకాలపై వారు తమ అభిప్రాయాన్ని అందించడాన్ని మేం ప్రోత్సహిస్తాం’’ అని అన్నారు. పబ్లిక్ కన్సల్టేషన్ వ్యవధి డిసెంబర్ 31, 2023 వరకు ఉంటుంది. అభిప్రాయాన్ని contact@ascionline.in ఇమెయిల్ ద్వారా సమర్పించవచ్చు