బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికను ఎవరూ నమ్మరు

No one believes BRS election plan– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికను ఎవరూ నమ్మరని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదని పేర్కొన్నారు. బతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి, పోయాక భీమా ఇస్తాననటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసి, ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తామనడం మోసం చేయటం కాక ఇంకేమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కొత్త హామీలని పేర్కొన్నారు.