కేసీఆర్‌ను ఢకొీట్టే సత్తా ఎవరికీ లేదు

No one can beat KCR– మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– ఆమనగల్‌, షాద్‌నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలు
నవతెలంగాణ-ఆమనగల్‌
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం కేసీఆర్‌ను ఢకొీట్టే సత్తా ఎవరికీ లేదని మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ఢిల్లీ నుంచి గుంపులు గుంపులుగా వివిధ పార్టీలకు చెందిన మహా మహా నాయకులు నరేంద్ర మోడీ, అమిత్‌ షా, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ లాంటి వారు ఎంత మంది వచ్చినా ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మాత్రం సింహం లాగా సింగిల్‌ గానే వారిని ఎదుర్కొంటారని అన్నారు. ఢిల్లీ గులాములు కావాలో.. తెలంగాణ బిడ్డలు కావాలో రేపు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కోరిక మేరకు ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఆమనగల్‌లో అవసరమైన కార్యాలయాలు, వెల్జాల్‌, గట్టు ఇప్పలపల్లి, రఘపతి పేట తదితర గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన జైపాల్‌ యాదవ్‌ను మరోసారి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.