ఎవరికీ గ్యారంటీ? ఇంకెన్నాళ్లిస్తారు?

Guaranteed to anyone? How long will it take?”మోడీ కా గ్యారెంటీ” అనే శీర్షిక దాదాపు ప్రతిరోజు ప్రధాన పత్రికలన్నింటిలో ఆయా పత్రి కల పేరుతో పాటు లేదా అంతకుమించిన ప్రాధా న్యతతో ప్రచురించబడుతున్నది. పదేండ్ల కింద కరెంటూ, రోడ్డు రవాణా మార్గాలే లేనట్టు, అసలు వంటగ్యాస్‌ గురించి తెలియక దేశ మహిళలంతా గత 70 ఏండ్లుగా కట్టెల పొయ్యిల్లోనే పడి కాలిపో తున్నటు, ఆర్థిక వ్యవహారాలే జరగనట్టు, భారత దేశ పటం అంతర్జాతీయంగా ఇప్పుడే ప్రింట్‌ చేసి నట్టు పటారం జరుగుతోంది. ఇంతటితో ఆగక ఆరు వేల కోట్ల రూపాయలను వెచ్చించి ”సెల్ఫీ విత్‌ మోడీ” అంటూ మోడీ ఫొటోలను ప్రధాన కూడళ్లలో పెట్టి సెల్ఫీ దిగడానికి కూడా బలవంత పెడుతున్నారు.
అంతర్జాతీయంగా పలుదేశాలు భారతదే శాన్ని మొదట్లో ల్యాండ్‌ ఆఫ్‌ గాంధీ, ల్యాండ్‌ ఆఫ్‌ నెహ్రూ అని సంబోధించేవారట, ఇప్పుడు మోదీ కా భారత్‌ అంటున్నారు! ల్యాండ్‌ ఆఫ్‌ గాంధీ అంటే శాంతికి చిహ్నమని, ల్యాండ్‌ ఆఫ్‌ నెహ్రూ అంటే సౌభ్రాతృత్వానికి చిహ్నమని చెబుతారు, మోదీ కా భారత్‌ అంటే నిరసనలను నిలువెత్తునా అణచివేసి ఒకే దేశంలోని ఒక సమూహం వేరొక సమూహంపై ఆధిపత్యం సాధించే క్రమం అంటు నెటిజన్లు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంలో అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యం లో వ్యక్తి కన్నా సమిష్టికి ప్రాధాన్యత. కానీ వ్యక్తిని మితిమీరి కీర్తించడం రాజరికాల్లో లేదా ఏకస్వామ్యంలో మాత్రమే సాధ్యం. ప్రజాస్వామ్యమంటే మెజారిటీ వాదమనే నినాదాన్ని దాదాపు ఖరారు చేసినట్టే దేశం లో! భారత రాజకీయాలలో గ్యారెంటీగా భక్తి, మతము అనే రెండు కాగడాలతో ఎన్ని కల రంగం సిద్ధమవుతోంది. ఈ కాగడా లను అంగీకరించిన వారు వాటి వెలుగులో ఉంటారు వ్యతిరేకించిన వారు వాటిచే కాల్చివేయ బడతారు అనే విధమైన బలవంతం కూడా ముందుకొస్తున్నది. ఇంతటి భయంకర వాతావర ణంలోనూ నిర్లక్ష్యానికి గురౌతున్న ప్రధాన అంశా లను ప్రస్తావించాల్సిందే, అవి చివర్లో రాస్తాను. ఏమి సాధించామో మరేమి గ్యారెంటీగా సాధించ బోతున్నామో కాలమే నిర్ణయిస్తుంది. కానీ పటిష్ట మైన నాయకత్వం నుండి బలిష్టమైన నాయకుడి వైపు దేశం వాలిపోతుంది! ఇది ప్రమాదానికి సంకే తం. మోదీకా గ్యారెంటీ అంటే ఎవరికి గ్యారెంటీ అనేది మొదటగా ఉత్పన్నమయ్యే ప్రశ్న. అంర్జాతీ యంగా దోషిగా నిలబెట్టబడిన మనిషి అదానీని పార్లమెంటు సాక్షిగా వెనకేసుకొచ్చి, కుంభకోణాల సూత్రదారికి కుర్చీ వేసి మళ్లీ ప్రపంచ ప్రథమ స్థానానికి చేర్చే గ్యారంటీయైతే అది వద్దు. మండు తున్న మణిపూర్‌ను గాలికొదిలి బెంగళూరులో బంతి పూలవర్షం కురిపించుకునే సంస్కృతి గ్యారంటీగా వద్దు.
వెలుగుతున్న కొవ్వొత్తిని మాత్రమే ప్రచారం లో పెట్టి దానికింద సమిధలైన మొత్తం జాతిని చీకట్లో పడేసిన వాస్తవాలను ఈ మధ్యనే గోల్డ్‌ మాన్‌ సాక్స్‌ అనే ప్రఖ్యాత రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ వెలువరించింది. ఈ దేశ తలసరి ఆదాయం అధికారికంగా రూ .1,73,000. మింట్‌ పత్రికలో వెలువడిన పైన పేర్కొన్న నివేదిక ప్రకారం 49.7 శాతం అనగా దాదాపు 50 శాతం దేశ ప్రజల (ఉపాధిలో పాలుపంచుకుంటున్నవారు మాత్రమే, వర్కింగ్‌ ఏజ్‌ పాపులేషన్‌) ఆదాయం 1,25,000 కన్నా తక్కువగా ఉన్నది. అనగా సగం జనాభా నెలసరి ఆదాయం పదివేల రూపాయల కన్నా తక్కువ, అనగా రోజువారి రూ.334 కన్నా తక్కువ. 20.3శాతం ప్రజల వార్షిక ఆదాయం 1,25,000 నుండి 2,10,000 మధ్యలో నమోద వుతున్నది. 18.1 శాతం ప్రజల ఆదాయం రెండు లక్షల పదివేల రూపాయల నుంచి, నాలుగు లక్షల పదివేల రూపాయల మధ్య ఉన్నది, 7.8శాతం ప్రజల ఆదాయం 4లక్షల పదివేల నుండి 8 లక్షల 30 వేల ఆదాయంగా ఉన్నది. 4.1శాతం ప్రజల ఆదాయం 8లక్షల30 వేల పైన వున్నదని తేలింది. ఇవి నమోదైన గణాంకాలు. 2020-23 ఆర్థిక సంవత్సరాలలో ఇదే జాబితాకు సంబం ధించిన వారి ఆదాయాల పెరుగుదల లేదా పెరు గుదల శాతాలను గమనిస్తే….49.7శాతం ప్రజల వార్షిక ఆదాయం మైనస్‌ 2.5శాతంగా నమోద యింది. 20.3శాతం ప్రజల వార్షిక ఆదా యం మూడు శాతం వృద్ధి సాధించగా 18.1శాతం ప్రజల ఆదాయం 6.9 శాతం వృద్ధి సాధించింది. 7.8శాతం ప్రజల ఆదాయంలో 10.4శాతం వృద్ధి కనపడగా 4.1శాతం ప్రజల ఆదాయం 12.6శాతంగా పెరిగినట్లు వెలువడింది. ఈ ఆదాయార్జితాల నిష్పత్తులను బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏమంటే తక్కువ ఆదాయం కలిగిన వాళ్లు మైనస్‌లో గాని లేదా అతి తక్కువ వృద్ధితో గాని కనపడితే ఎక్కువ ఆదాయం కలిగిన వాళ్లు ఎక్కువ శాతం వృద్ధిని చేజిక్కించుకుంటున్నారు. దేశ జీడీపీ పెరుగు తుంది, స్టాక్‌ మార్కెట్‌ దూసుకుపోతుంది ప్రపం చంలో 5,4,3వ ఆర్థిక వ్యవస్థగా అవతరించబో తుంది.ఇవన్నీ సరే ప్రపంచంలో ఎక్కడ లేనంతగా ఈ దేశంలో పనిచేసే వారిలో సగం మంది విప రీతమైన దోపిడీకి గురవుతున్నారు. దీనికి వారి దురదృష్టం కాదు ఆ దోపిడీకి అవకాశం కల్పి స్తున్న పరిపాలన విధానాలు. దీనికి పరిష్కారం కనుగొనబడే గ్యారెంటీని ఇవ్వకపోతే రాత్రిపూట విందు సందర్భంగా వెలుగు తగ్గిందని ఖైదీలను కాల్చివేసి తద్వారా రగిలిన కార్చిచ్చులో చిందు లేసిన నీరో చక్రవర్తికి మనకి తేడా ఉండదు.
గడచిన పదేళ్ల గ్యారెంటీని ఒకసారి పరిశీలిద్దాం..
ప్రజాస్వామ్యమంటే సంఖ్యకు పరిమితమా? ఎలాగైనా చేసి మెజారిటీ సంఖ్యను పొందితే సరి పోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అని గత పదేండ్ల పాలన స్పష్టం చేస్తుంది. గత నెల ఛండీగర్‌లో మేయర్‌ ఎలక్షన్స్‌ సందర్భంగా రిట ర్నింగ్‌ అధికారి బ్యాలెట్‌ పేపర్లను చెల్లనివిగా మా ర్చేక్రమం సీసీటీవీలో నమోదయింది కాబట్టి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూ ‘ప్రజాస్వామ్యా న్ని మర్డర్‌ చేయకండ’ి అంటూ తిట్టిపోసి, ఎన్నిక ను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించింది. ఉత్తర భారత్‌లో కొందరు అభ్యర్థులు ఈవీఎంలను తస్క రించి ఎత్తుకుపోతున్నారు. వీటిపైన ఎలాంటి చర్యలకు అధికారులు ఉపక్రమించలేదు. భారత ఎన్నికల కమిషన్‌ ఒక స్వతంత్ర సంస్థ, దాని స్వ తంత్రతను కాపాడడానికి కమిషనర్ల ఎన్నిక ఏక పక్షంగా ఉండకూడదని త్రిసభ్య కమిటీని- ప్రధా నమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాలను సభ్యులుగా పాటిస్తూ వస్తున్నారు. దీనిని తోసి రాజని చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాను తొలగిస్తూ ప్రధానమంత్రి తమ మంత్రివర్గంలోని ఒకరిని నామినేట్‌ చేయొచ్చు అన్న కొత్త ప్రతిపా దనను సాధించుకున్నారు. ఇప్పటికే ఎన్నికల కమి షన్‌ కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతూ ఉం టుంది,వారు కావాలనుకున్నప్పుడే ఎన్ని కల తేదీలను ప్రకటిస్తుంది అది పూర్తిగా ఏకపక్షం ఉన్నది అని ప్రశాంతి కిషోర్‌ లాంటి వాళ్లు అనేకసార్లు వాపోయారు. ఇకనుండి ఆ అవసరమే ఉండదు ఎం దుకంటే ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారు కాబట్టి. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధి కారికంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన వివరాల ప్రకారం రూ.1,264 కోట్ల ను ఖర్చు చేసింది. కమిషన్‌ నిబంధనల ప్రకారం ఒక పార్లమెంటు సభ్యుడు రూ.95లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేయకూడదు. అలాంటప్పుడు రూ.415 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుకాకూడదు. మరి 1,264 కోట్లు ఖర్చుపెట్టినప్పుడు ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తూ కూర్చున్నట్లు? సెంటర్‌ ఫర్‌ మీడియా స్ట డీస్‌ అనే సంస్థ ప్రకారం ఒక్క బీజేపీ 2019 ఎన్ని కలలో రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టిందట. ఈ దేశంలో హార్స్‌ ట్రేడింగ్‌ (అభ్యర్థులను కొనుగోలు చేసి ప్రభుత్వాలను మార్చడం) చాలా బాహాటంగా జరుగుతుంది. రిసార్ట్‌ పాలిటిక్స్‌ అంటూ దానికి పేరు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ద్వారా రెయిడ్‌ చే యబడిన అనేకమంది ప్రతిపక్ష నాయకులు వ్యా పారులు బీజేపీలోకి చేరిపోతే శుద్ధ నీతిమం తులు అవుతున్నారు. ఈ అంశాలన్నీ ఎన్ని కల కమిషన్‌ పరిశీలించాల్సిన అవసరం లేదా? సుమోటోగా కేసులను స్వీకరించా ల్సిన అవసరం లేదా? ఇదే పదేళ్ల గ్యారెం టీలో గతంలో ఎండు లేనంతగా గవర్నర్ల వ్యవస్థ దిగజారిపోయింది. కేరళ, తమిళ నాడు, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రాలలో గవర్నర్లు ప్రత్యా మ్నాయ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కేంద్రం వత్తాసు పలకడం లేదంటే నమ్మగలమా? మీడియా మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఘనత ఈ పదేండ్ల గ్యారెం టీలోనే మనం చూడగలం. దూరదర్శన్‌ ఛానెళ్ళ ల్లో ఇతరులకు అవకాశం లేదు. కాస్త కూస్తో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎన్‌.డి టీవీని హస్తగతం చేసుకున్నారు. అడ్వర్‌డైజ్‌లన్నీ కేవలం ప్రభు త్వానికి వత్తాసు పలికే మీడియా హౌసెస్‌కు మా త్రమే వెళుతున్నాయి. నాటి ప్రధానమంత్రి మన్మో హన్‌ సింగ్‌ 62సార్లు నిషేధం లేని, కనీసం వంద మందికి తగ్గకుండా రిపోర్టర్లను ఆహ్వానించి, ప్రెస్‌మీట్లు నిర్వహించారు. కానీ ఈ పదేళ్ల కాలం లో నిషేధంతోనైనా ఒక్క ప్రెస్‌మీట్‌ కూడా నిర్వ హించబడలేదు. ఈ పద్ధతిని పునరావృతం చేసే గ్యారంటీ వద్దు.
వీటికి గ్యారంటీ ఇవ్వండి…
దేశ ప్రజలకు గ్యారంటీలు కావాలి, వాటిని పాలకులు నెరవేర్చాలి కూడా. మొట్టమొదటిది మత సామరస్యం. అది కర్ర పెత్తనం కాదు, క్లాస్‌ రూములోనిదైనా సరే! కోర్టు రూములోనో లేదా పోలీసు స్టేషన్‌లోనో కనిపించే నిశ్శబ్ద శాంతి కాదు. భక్తి దేవుడిపై శ్రద్ద కన్నా పక్క వాడిపై ఆధి పత్యాన్ని సాధించానన్న ద్వేశానికి ప్రతీకగా మారింది, దానికి విరుగుడు కావాలి. ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతుకలను బద్ద శత్రువులుగా భావించే విధానానికి స్వస్తి చెప్పే గ్యారంటీ కావాలి, దేశాభివృద్ధి ద్వేషంలోంచి ఏర్పడిన ఐక్యతలో లేదని గుర్తించాలి. రెండవది, ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు/ కూలదోత, ఆ తరువాతి పరిపాలనా, ఆశ్త్రిత పక్షాపాతాలు ఇప్పు డున్నట్లుగా కాకుండా! ధర్మము, సంస్కృతీ, దేశ భక్తీ ఎన్నికల అస్త్రాలు చేయరాదు. మూడవది, వందశాతం అక్షరాస్యతకు హామీ. నాల్గవది, నమో దైన వృద్ధి నాదని చెప్పే ముందు స్థిరమైన ఉపాధి లేక తిరోగమన ఆదాయాలతో సమిధలౌతున్న వారికి ఉపశమనం కేవలం రాజకీయాల్లో లేదని గుర్తించాలి, దానికి కారకులౌతున్న కార్పొరేటీ కరణకు ముకుతాడు వేయకపోతే గ్యారంటీగా నష్టపోతాము. ఇక ఐదవది, జీఎస్టీ పేరు మీద సొమ్మంతా తమ ఖజానాలోనే పడేట్టు చేసుకుని రాష్ట్రాలు తమ వాటా కోసం ఢిల్లీలో ధర్నాకు దిగే పరిస్థితి వుండకూడదు. ఇక పరోక్ష పన్ను విధానం ద్వారా పేదలనుండి 65శాతం రెవెన్యూను రాబ ట్టుకుని మరింత పేదరికంలో నెట్టే విధానానికి చరమగీతం పాడాలి.