వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హౌమ్స్’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ‘క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు’ చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రైటర్ మోహన్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ఇది ఏడుగురికి సంబంధించిన కథ. వెన్నెల కిషోర్‌ది డిటెక్టీవ్ రోల్. ప్రతి పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఇందులో డిటెక్టీవ్ రోల్ కొంచెం హ్యూమర్‌తో ఉంటుంది. ఆ పాత్రకు వెన్నెల కిషోర్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారు. ఆయన ఉత్తరాంధ్ర యాసని ఒక ఛాలెంజ్ తీసుకొని కష్టపడి నేర్చుకొని, సినిమా చేశారు. కథలో క్రైమ్, కామెడీ, ఎమోషన్, థ్రిల్, లవ్ అన్నీ బ్యాలెన్డ్స్‌గా ఉంటాయి. – 1991లో జరిగే కథ. టీజర్‌లో చెప్పినట్లు రాజీవ్ గాంధీ వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఇంకొన్ని సంఘటనలు జరిగాయి. వీటి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది షెర్లాక్ హౌమ్స్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌తో చాలా ఆసక్తికర స్క్రీన్ ప్లేతో చేశాం. ఈ కథని ఎవరూ ఊహించలేరు. తెలుగులో డిటెక్టీవ్ సినిమా అనగానే చిరంజీవి ‘చంటబ్బారు’ గుర్తుకు వస్తుంది. షెర్లాక్ హౌమ్స్ అనేది హాలీవుడ్ ఫిక్షనల్ క్యారెక్టర్. అది కొందరికి పరిచయం లేకపోవచ్చు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా వంశీ నందిపాటి సూచన మేరకు ఆ ట్యాగ్‌ని పెట్టడం జరిగింది. అందులోనూ ‘తాలూకా’ అనేది ఇప్పుడు ట్రెండింగ్ (నవ్వుతూ). వంశీ నందిపాటికి ఈ సినిమా చాలా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో చాలా థ్రిల్ అయ్యారు. ఆయన సినిమా రిలీజ్ చేయడం చాలా అనందంగా ఉంది. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలతో సినిమా నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళింది.