క్లైమాక్స్‌ని ఎవ్వరూ ఊహించలేరు

No one can predict the climax‘ఈమధ్య కాలంలో భిన్న నేపథ్యాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ‘క’ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన తొలి నిమిషం నుంచే ‘క’ ప్రపంచానికి ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు’ అని నాయికలు నయన్‌ సారిక, తన్వీ రామ్‌ అన్నారు.హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ ‘క’. నయన్‌ సారిక, తన్వీ  మ్‌ కథానాయికలు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై చింతా గోపాలకష్ణ రెడ్డి నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ తెరకెక్కించిన ఈ  నిమా దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 31న తెలుగులో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగులో ఈ సినిమాను ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి, మలయాళంలో  రో దుల్కర్‌ సల్మాన్‌ తన వేఫర్‌ ఫిలింస్‌ పై రిలీజ్‌ చేయబోతున్నారు. సినిమా విడుదల నేపథ్యంలో నాయికలు నయన్‌సారిక, తన్వీరామ్‌ మీడియాతో  చ్చటించారు.
సత్యభామగా అలరిస్తా : నయన్‌సారిక
‘నేను ‘ఆరు’ సినిమాలో నటిస్తున్న టైమ్‌లో ఈ సినిమా అవకాశం వచ్చింది. డైరెక్టర్‌ సందీప్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. ఇందులో సత్యభామ పాత్రలో నటించా. ‘గం గం గణేశా’లో మోడ్రన్‌గా, ‘ఆరు’లో ట్రెడిషనల్‌గా కనిపించా. వాటికి భిన్నమైన రోల్‌ ఈ సినిమాలో చేశా. ఈ కథ విన్నప్పుడు క్లైమాక్స్‌ మనసులో గుర్తుండిపోయింది. థియేటర్స్‌లో మూవీ రిలీజ్‌ అయ్యాక ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు’.
సర్‌ప్రైజ్‌ చేసే పాత్రలు : తన్వీరామ్‌
‘ఈ సినిమాలో రాధ అనే క్యారెక్టర్‌ చేశాను. రాధ ఒక స్కూల్‌ టీచర్‌. అభినయ వాసుదేవ్‌, సత్యభామ ఒక టైమ్‌ ఫ్రేమ్‌లో కనిపిస్తే, నేను మరో పీరియడ్‌లో కనిపిస్తా. నా పాత్రకు, వారి పాత్రలకు మధ్య కనెక్షన్‌ ఏంటనేది స్క్రీన్‌ మీదే చూడాలి. అలాగే కష్ణగిరి అనే ఊరు కూడా ఒక కీ రోల్‌ ప్లే చేస్తుంది. ప్రతి క్యారెక్టర్‌లో ట్విస్ట్‌లు, టర్న్స్‌ ఉంటాయి. క్లైమాక్స్‌ మాత్రం మరో స్థాయిలో ఉంటుంది. మా అందరినీ కథకు బాగా కనెక్ట్‌ చేసింది పతాక సన్నివేశాలే. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ అంతా మూవీ చూసేందుకు వెయిట్‌ చేస్తున్నారు. సెకండ్‌ పార్ట్‌కు ‘క’ సినిమాలో లీడ్‌ ఉంటుంది. ఈ సీక్వెల్‌ గురించి మేకర్స్‌ త్వరలోనే తెలియజేస్తారు’.