
నవతెలంగాణ – నెల్లికుదురు
జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ టి పి సి సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి స్వగృహంలో మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్లు మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ లతో కలిసి బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల్లో 80 సీట్లపైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేస్తామని అన్నారు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు రాజశేఖర్ రెడ్డి హాయంలో ప్రవేశపెట్టిన పథకాలే నేటికి కోన సాగుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై కార్యకర్తలు ఉత్తేజం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు టిఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చామని ఈసారి ఇచ్చేది లేదని ప్రజలు తేల్చి చెప్పారని అన్నారు గ్రామాలకు గ్రామాలే కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు ముందుకు వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోగుల మల్లయ్య జిల్లా ప్రచార కమిటీ నాయకుడు బైరు అశోక్ బ్లాక్ కాంగ్రెస్ , సోషల్ మీడియా ఇన్చార్జి తవిశెట్టి రాకేష్. బ్లాక్ కాంగ్రెస్, జిల్లా, డివిజన్, మండలాల మరియు వివిధ గ్రామా శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు