
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరని పార్టీ యువజన కాంగ్రెస్ జయరాం తండా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు సురేశ్ నాయక్ అన్నారు. బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ప్రతి యువకుడు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యశస్విని రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి సామాజిక వర్గాన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు దక్కాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొద్దు అని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో బానోతు వెంకన్న , బదావత్ లక్ పతి , రమేష్, వెంకన్న, సోమన్న, నరేందర్ తటితరులు పాల్గొన్నారు.