జోయా తప్ప ఇంకెవ్వరూ చేయలేరు

Except Zoya No one else Can't do itబాలీవుడ్‌ కథానాయిక కత్రినా కైఫ్‌ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై ఆఫీసర్‌గా నటించారు. వైఆర్‌ఎఫ్‌ బ్యానర్‌లో రూపొందిన టైగర్‌ ఫ్రాంచైజీలో సల్మాన్‌ ఖాన్‌ పోషించిన టైగర్‌ పాత్రకు దీటుగా ఉండే జోయా పాత్రలో కత్రినా అద్భుతంగా ఒదిగిపోయారు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు ‘ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై’ చిత్రాలు రూపొందితే, అందులో జోయా పాత్రలో కత్రినా నటించిన తీరుకి యావత్‌ సినీ ప్రపంచం ప్రశంసల వర్షాన్ని కురిపించాయి. ఈ టైగర్‌ ఫ్రాంచైజీలో జోయా పాత్రను కత్రినా కైఫ్‌ తప్ప మరొకరు చేయలేరనేలా యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఆమెను ప్రశంసిస్తూ ‘టైగర్‌ 3′ చిత్రం నుంచి జోయా పాత్రలో నటిస్తోన్న కత్రినా కైఫ్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.
ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ, ”వైఆర్‌ఎఫ్‌ సంస్థ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై పాత్ర జోయా. ఆ పాత్రను నేను పోషించటం ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోయే జోయా క్యారెక్టర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతే కాదు.. ఆమె సహదయం కలది. తనవారిని రక్షించుకుంటూనే విధేయతను చూపగల మనస్తత్వం ఆమె సొంతం. తన అవసరం ఉన్న ప్రతీ చోట ప్రత్యక్షం కావటంతో పాటు అక్కడ మానవత్వాన్ని చూపుతుంటుంది. జోయా పాత్రను పోషించటం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ప్రతి సినిమా నాకొక పరీక్షగానే భావిస్తాను. అందులో ఈ సినిమా కూడా ఉంది. ఈసారి ఇందులో యాక్షన్‌ సన్నివేశాలు నెక్ట్స్‌ లెవల్లో ఉండాలని ముందుగానే భావించాం. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో శారీరకంగా ఎక్కువ కష్టపడింది ఈ సినిమాకే. నా పాత్ర ధైర్యంతో, సవాళ్లను ఎదుర్కొనేలా, బలంగా ముందుకు సాగేలా ఉంటుంది. ఈ జోయా పాత్రను స్క్రీన్స్‌పై చూసేటప్పుడు ఆడియెన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి సందర్బంగా విడుదలకు రెడీ అవుతోంది.